Jammu and Kashmir : ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. షోక్‌బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు, ఆర్మీ బృదం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

Jammu and Kashmir : ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu And Kashmir (2)

Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్ లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. షోక్‌బాబా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు, ఆర్మీ బృదం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

See This Also : Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో ఖాతా తెరిచిన భారత్.. మీరాబాయి చానుకు రజత పతకం

భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు.. కాల్పులు జరిగిన ప్రాంతంలో మందుగుండు సామాగ్రితోపాటు రెండు AK – 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ లోయలో శుక్రవారం కూడా ఎదురు కాల్పులు జరిగాయి.. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ కు సంబందించిన వివరాలను జమ్మూకాశ్మీర్ పోలీసులు మీడియాకు తెలియచేశారు.