హైటెన్షన్ : కశ్మీర్‌లో ఫైరింగ్ – టెర్రరిస్ట్ హతం

  • Published By: veegamteam ,Published On : February 22, 2019 / 04:35 AM IST
హైటెన్షన్ : కశ్మీర్‌లో ఫైరింగ్ – టెర్రరిస్ట్ హతం

శ్రీనగర్ : కశ్మీర్‌.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్‌లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. అయితే ముష్కరుల కాల్పులను బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. ఇంటిలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉండి ఉంటారని అనుమానిస్తున్న బలగాలు… ఆ ఇంటిని చుట్టుముట్టాయి. బద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఈఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు సోపోర్‌లో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. 

దక్షిణ కశ్మీర్ లో ఇప్పటివరకు పుల్వామా, అవంతిపుర ప్రాంతాల్లో ఉగ్రవాదుల సంచారం అధికంగా ఉంటూ ఆపరేషన్ ఎక్కువగా సాగింది. ఇప్పుడు దక్షిణ కశ్మీర్ నుంచి ఉత్తర కశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. అక్కడ ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపైన వార్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. నిన్న అర్ధరాత్రి నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. సోపోర్‌లో ఆపి.. ఆపి కాల్పులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ కొనసాగుతోంది. కాల్పులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడున్నస్థానికులను బయటికి రావద్దని భద్రతాబలగాలు హెచ్చరించాయి. 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువ మందిని రోడ్లపై ఉండనివ్వడం లేదు. ముఖ్యంగా ఎన్ కౌంటర్ ప్రాంతాల్లో ఎవరినీ ఉండనీయకుండా ఇళ్లకు తరలి వెళ్లిపోవాలని సూచనలు చేస్తున్నారు.