Byju’s Online Company : బైజూస్ ఆన్ లైన్ సంస్థ, రవీంద్రన్ బైజూ ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

బైజూస్ సీఈఓ రవీంద్రన్ బైజూ, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూపై ఈడీ కేసు నమోదు చేసింది.

Byju’s Online Company : బైజూస్ ఆన్ లైన్ సంస్థ, రవీంద్రన్ బైజూ ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

Ravindran Byju

Byju’s Online Company : బైజూస్ ఆన్ లైన్ సంస్థ, ఆ సంస్థ సీఈఓ రవీంద్రన్ బైజూ ఇళ్ళు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. ఫెమా చట్టం కింద శనివారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని మూడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ కేంద్ర కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సోదాల్లో విలువైన పత్రాలు, డిజిటల్ డేటా జప్తు చేసినట్లు తెలిపింది.

బైజూస్ సీఈఓ రవీంద్రన్ బైజూ, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూపై ఈడీ కేసు నమోదు చేసింది. థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. ఆన్ లైన్ లో బైజూస్ పేరుతో విద్యను బోధిస్తోన్న విషయం తెలిసిందే.

BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు

బైజూస్ కంపెనీకి సుమారు రూ.28 వేల కోట్ల విదేశీ పెట్టుబడి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2011 నుంచి 2023 మధ్య కాలంలో ఆ మొత్తం జమ అయినట్లు ఫెమా చట్టం కింద జరిపిన సోదాల్లో తేలింది. ఇదే సమయంలో కొన్ని విదేశీ కంపెనీలకు సుమారు రూ.9754 కోట్లు రెమిట్ చేసినట్లు కూడా బైజూస్ పై ఆరోపణలు ఉన్నాయి.