Hijab Row: ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం.. కాలేజీ ఈవెంట్‭లో బుర్ఖా వేసుకుని డాన్స్ చేసిన అబ్బాయిలు

దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ సదరు విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై కాలేజీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అందులో ‘‘సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రకారం మా కాలేజీ ఈవెంటులో కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించి డాన్స్ చేయడం మా దృష్టికి వచ్చింది. నిజానికి ఇది ముందస్తుగా తెలియజేసింది కాదు

Hijab Row: ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం.. కాలేజీ ఈవెంట్‭లో బుర్ఖా వేసుకుని డాన్స్ చేసిన అబ్బాయిలు

Engineering College issues statement, suspends students dancing in burqa at an event

Hijab Row: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఏదో రూపంలో తరుచూ ఈ వివాదం తెరవైకి వస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఈవెంటులో అబ్బాయిలు హిజాబ్ వేసుకుని డాన్స్ చేయడం మరోసారి ఈ వివాదాన్ని పైకి లేపింది. రాష్ట్రంలోని మంగళూరు పట్టణంలో గురువారం వెలుగు చూసింది ఇది. హిజాబ్ వేసుకుని డాన్స్ చేసిన వారిని సస్పెండ్ చేసినట్లు కాలేజీ యాజమాన్యం పేర్కొంది.

New CM: నేడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని నిర్ణయించనున్న కాంగ్రెస్

మంగళూరులో ఉన్న సేయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో తాజాగా ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంటులో విద్యార్థులు రకరకాల కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా కొంత మంది విద్యార్థులు (అబ్బాయిలు) హిజాబ్ ధరించి డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ప్రారంభమైంది. హిజాబ్ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అలాగే కాలేజీ యాజమాన్యంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ సదరు విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై కాలేజీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అందులో ‘‘సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రకారం మా కాలేజీ ఈవెంటులో కొంత మంది విద్యార్థులు హిజాబ్ ధరించి డాన్స్ చేయడం మా దృష్టికి వచ్చింది. నిజానికి ఇది ముందస్తుగా తెలియజేసింది కాదు. కాలేజీ ఈవెంటులో ఆ విద్యార్థులు ఒక్కసారిగా వచ్చి అలా ప్రవర్తించారు. దీనిపై మేం చర్యలు తీసుకున్నాం. వారిని సస్పెండ్ చేశాం. మా కాలేజీ మతాల మధ్య వర్గాల మధ్య ఉద్రిక్తతను రగిలించే చర్యల్ని అంగీకరించదు’’ అని పేర్కొన్నారు.

Himanta Sarma: అందుకే ముస్లిం వ్యక్తుల్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది: అస్సాం సీఎం