Rahul Gandhi : వీడియో కాల్స్ చాలు..క్రీడాకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు గెలిచిన క్రీడాకారుల‌తో వీడియో కాల్స్ మాట్లాడ‌టం చాల‌ని, వారికి హామీ ఇచ్చిన రివార్డుల‌ను అందించాల‌ని మోదీకి చుర‌క‌లు వేశారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi : వీడియో కాల్స్ చాలు..క్రీడాకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

Rg2

Rahul Gandhi  ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు గెలిచిన క్రీడాకారుల‌తో వీడియో కాల్స్ మాట్లాడ‌టం చాల‌ని, వారికి హామీ ఇచ్చిన రివార్డుల‌ను అందించాల‌ని మోదీకి చుర‌క‌లు వేశారు రాహుల్ గాంధీ. గ‌తంలో ఒలింపియ‌న్ల‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వం గుప్పించిన హామీల‌ను ఇంకా నెర‌వేర్చ‌లేద‌నే క‌ధ‌నాల స్క్రీన్ షాట్ల‌ను ఇన్‌స్టాగ్రాంలో రాహుల్ పోస్ట్ చేశారు.  క్రీడాకారులను అభినందించ‌డంతో పాటు వారికి ద‌క్కాల్సినవి అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, క్రీడా బ‌డ్జెట్‌లో కోత‌లు పెట్ట‌డం స‌రికాద‌ని రాహుల్ పేర్కొన్నారు.

గతంలో టోక్యో ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు గెలుపొందిన నీర‌జ్‌ చోప్రా, భ‌జరంగ్ పునియాలు త‌మ‌కు హామీ ఇచ్చిన రివార్డుల హామీల‌ను నెర‌వేర్చాల‌ని మంత్రులు, అధికారుల‌ను కోరుతూ 2109లో చేసిన ట్వీట్ల స్క్రీన్‌షాట్ల‌ను కూడా రాహుల్ అటాచ్ చేశారు. దయచేసి మీరు ఆటగాళ్లకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి మరియు వారి ప్రైజ్ మనీని ఇవ్వండి. తద్వారా మేము ఈ విషయాల నుండి మా దృష్టిని మరల్చగలము. రాబోయే ఒలింపిక్స్‌పై మన పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తాము మరియు మన దేశం మరియు రాష్ట్రం పేరును ప్రకాశింపజేస్తాము అని నీరజ్ చోప్రా 2019లో చేసిన ట్వీట్ లో తెలిపారు.