పీఎఫ్ ఖాతాదారులకు న్యూ ఇయర్ కానుక, బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

పీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీ రేటును అందించనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. సుమారు ఆరు కోట్ల మంది ఖాతాదారులకు లబ్ది చేకూరుతుందని అంచనా.

పీఎఫ్ ఖాతాదారులకు న్యూ ఇయర్ కానుక, బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

Minister Santosh Gangwar

epf interest rate credited : ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీ రేటును అందించనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. సుమారు ఆరు కోట్ల మంది ఖాతాదారులకు లబ్ది చేకూరుతుందని అంచనా. 2019-20 సంవత్సరానికి గాను…వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.

2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్ మొత్తంపై తొలి విడతగా…8.5శాతం వడ్డీ ఖాతాదారులకు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో 2019-20 వడ్డీ రేటును 8.5శాతంగా ఈపీఎఫ్ వో నిర్ణయించింది. అయితే..కరోనా వైరస్ భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేటును రెండు విడతలుగా ఇస్తామని సెప్టెంబర్ మాసంలో ప్రకటించింది. మొదటి విడతగా…8.15 శాతం, రెండో విడతగా..0.35 శాతం ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది.

ఖాతాదారులు పీఎఫ్ బ్యాలెన్స్ ను  SMS, ఆన్ లైన్, మిస్ట్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

umang యాప్ : ఈ యాప్ ను మొదలట డౌన్ లోడ్ చేసుకోవాలి. UAN నంబర్ పై పాస్ బుక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పాస్ వర్డ్ టైప్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేస్తే PF బ్యాలెన్స్ తెలుస్తుంది.
epfindia.gov.in పోర్టల్ కు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

SMS :
EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నంబర్ కు పంపించాలి.
Missed Call : రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో 011-2290 1406 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే..PF బ్యాలెన్స్ తెలుస్తుంది.