EPFO Alert : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబర్ 31లోపు ఆ పని చేయాల్సిందే.. లేదంటే డబ్బులు రావు

మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) ఖాతాదారా? అయితే మీకో అలర్ట్. డిసెంబర్ 31లోపు మీరు ఆ పని పూర్తి చేయండి. లేదంటే అనేక ప్రయోజనాలు కోల్పోతారు.

EPFO Alert : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబర్ 31లోపు ఆ పని చేయాల్సిందే.. లేదంటే డబ్బులు రావు

Epfo Alert

EPFO Alert : మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) ఖాతాదారా? పీఎఫ్ ఖాతా ఉందా? అయితే మీకో అలర్ట్. డిసెంబర్ 31లోపు మీరు ఆ పని పూర్తి చేయండి. లేదంటే అనేక ప్రయోజనాలు కోల్పోతారు.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగులతో పాటు, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పిస్తోంది. ప్రతి నెలా జీతం నుంచి కొంత అమౌంట్ కట్ అవుతుంది. పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఆ డబ్బు.. భవిష్యత్‌లో పెళ్లి, ఇంటి నిర్మాణం వంటి ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఉద్యోగికి ఉపయోగపడుతుంది. ఇక పెన్షన్‌ స్కీమ్‌, బీమా సౌకర్యం ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకూ అండగా నిలుస్తోంది. అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే.. పీఎఫ్‌ ఖతాదారుడు నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.

PF Interest Money : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్… వడ్డీ డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..

కాగా, డిసెంబర్‌ 31లోపు నామినీ వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది. ఒకవేళ ఇదివరకే నామినీని మెన్షన్ చేసి ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పటివరకు నామినీ వివరాలు ఇవ్వని వారు మాత్రం డిసెంబర్ 31లోపు ఆ పని చేయాలి. ఈపీఎఫ్‌వో చందాదారుడికి జరగరానిది ఏదైనా జరిగే సందర్భంలో పీఎఫ్‌ మొత్తంతో పాటు, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ స్కీమ్‌ మొత్తాలు నామినీకి చేరుతాయి. కాగా, పీఎఫ్ ఖాతాదారులు నామినీని సులువుగా యాడ్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది ఈపీఎఫ్‌వో. ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

నామినీని యాడ్ చేసుకునే ప్రాసెస్..
* ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ కు (epfindia.gov.in) వెళ్లండి.
* సర్వీస్‌ విభాగంలో ‘ఫర్‌ ఎంప్లాయిస్‌’ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
* తర్వాత ‘Member UAN/Online Service (OCS/OTCP)’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
* యూఏఎన్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
* అక్కడ ‘మేనేజ్‌’ విభాగంలోని ‘ఈ-నామినేషన్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* ‘యెస్‌’పై క్లిక్‌ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వొచ్చు.
* ‘యాడ్‌ ఫ్యామిలీ డీటెయిల్స్‌’ ద్వారా నామినీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లను కూడా ఇవ్వొచ్చు.
* ‘సేవ్‌ నామినేషన్‌’పై క్లిక్‌ చేశాక.. ఓటీపీని ఎంటర్‌ చేస్తే ప్రక్రియ పూర్తి అయినట్టే.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏదో నెల నెలా డబ్బులు జమ కావడమే కాదు ఇంకా చాలా ప్రయోజనాలుంటాయి. ఈపీఎఫ్‌లో ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల కుటుంబానికి రూ.7 లక్షలు ప్రయోజనం అందుతుంది. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్ స్కీమ్. పీఎఫ్ ఎక్కౌంట్ ఉన్న ఉద్యోగులంతా ఈ స్కీమ్‌కు అర్హులే. పీఎఫ్ ఎక్కౌంట్ కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యోగి మరణిస్తే.. కుటుంబసభ్యులకు రూ.7 లక్షల భీమా అందుతుంది.

ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ EDLI ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పీఎఫ్ చందాదారులకు రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. గతంలో ఈ ఇన్సూరెన్స్ కవర్ గరిష్టంగా రూ.6 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు రూ.7 లక్షల వరకు లభిస్తాయి. కేంద్రం ఇటీవలనే ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచింది.