EPFO Alert : ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే డబ్బులు రావు, ప్రాసెస్ ఇదే..

పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు తక్షణమే ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంది. లేకపోతే నామినీకి అందాల్సిన డబ్బులు అందవంటోంది.

EPFO Alert : ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే డబ్బులు రావు, ప్రాసెస్ ఇదే..

Epfo Alert

EPFO Alert : పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు తక్షణమే ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంది. లేకపోతే నామినీకి అందాల్సిన డబ్బులు అందవంటోంది.

ఉద్యోగుల భవిష్యత్‌ కోసం నియమించిన సంస్థ ‎ఈపీఎఫ్ఓ(ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్). ప్రతి నెల జీతం పొందిన వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ రూపంలో ఈ సంస్థకు యాజమాన్యం కేటాయిస్తుంది. ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ఈ-నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ-నామినేషన్ దాఖలు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక సభ్యుడి మరణంపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), పెన్షన్ (ఈపీఎస్), ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్ఐ) ప్రయోజనాలను సులభంగా పొందడానికి ఈ-నామినేషన్ దాఖలు తప్పనిసరి. ‎ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి.

కాగా, ఈ-నామినేషన్ దాఖలు కోసం ఏ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ లోనే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే వెంటనే చేయండి.

ఈ-నామినేషన్ దాఖలు ప్రక్రియ..

‎‎* ఈపీఎఫ్ఓ అధికారిక లింక్ పై క్లిక్ చేయండి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)
* యూఏన్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి.‎
* మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
* అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ‎ఈ-నామినేషన్ ఎంచుకోండి.‎
* తర్వాత ‘ఫ్యామిలీ డిక్లరేషన్’ అప్ డేట్ చేయడానికి అవును క్లిక్ చేయండి.‎
* ఇప్పుడు ఒకరికన్న ఎక్కువమంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. * వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి ‘నామినేషన్ వివరాలు’ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’ మీద క్లిక్ చేయండి.‎
* ఓటీపీ జనరేట్ చేయడానికి ‘ఈ సైన్’ మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు వచ్చిన ‘ఓటీపీ’ని సబ్మిట్ చేస్తే ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయినట్టే.