EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు జమ

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ప్రకటించింది. 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు జమ

Epfo

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO శుభవార్త చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ప్రకటించింది. 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేసినట్లు ఈపీఎఫ్ ట్వీట్ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.5 శాతం వడ్డీ రేటును పీఎఫ్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది.

Liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5శాతం వడ్డీ రేటు అందిస్తోంది ఈపీఎఫ్ఓ. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్లు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. దీతో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడేళ్ల కనిష్టస్థాయికి తగ్గించింది ఈపీఎఫ్ఓ. ఇక, ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రాలు ఉన్నందున వడ్డీ రేటును మార్చలేదు.

పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు సులభంగానే వారి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.

పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా..
* ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
* లాగిన్ అవ్వాలి.
* సర్వీసెస్ ఆప్షన్ కింద ఉన్న మెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.
* ఈపీఎఫ్‌వో యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
* మెంబర్ ఐడీపై క్లిక్ చేయండి.
* ఈపీఎఫ్ పాస్‌బుక్ డిప్‌ప్లే అవుతుంది.
* ఇక్కడ మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో చూడొచ్చు.

మిస్డ్ కాల్ సర్వీస్..
పీఎఫ్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి మరో ఆప్షన్ కూడా ఉంది. అదే మిస్డ్ కాల్ సర్వీస్. 011-229014016 నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. అయితే యూఏఎన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

ఉమాంగ్ ఆప్షన్..
బ్యాలెన్స్ తెలుసుకునేందుకు మరొక ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత పీఎఫ్ ఆప్షన్ ఎంచుకొని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

ఎస్ఎంఎస్‌తో..
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి 7738299899 నెంబర్ కి EPFOHO UAN ఎస్ఎంఎస్ చేయాలి.