EPFO Pension : అధిక పింఛన్ దరఖాస్తు గడువును పొడిగించిన ఈపీఎఫ్ వో

అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

EPFO Pension : అధిక పింఛన్ దరఖాస్తు గడువును పొడిగించిన ఈపీఎఫ్ వో

EPFO

EPFO Pension : అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకముందు మార్చి 3 వరకే ఈ అవకాశం ఉండేది. అయితే దీన్ని రెండు నెలలపాటు ఈపీఎఫ్ వో పొడిగించింది. ఈపీఎఫ్ వో యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్ పై పెట్టిన యూఆర్ఎల్ లో అధిక పెన్షన్ కోసం ఈ ఏడాది మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

అర్హత ఉన్న ఉద్యోగులు వారి సంస్థలతో కలిసి ఉమ్మడి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అధిక పింఛన్ సౌకర్యాన్ని ఎంచుకునేందుకు అర్హత ఉన్న వారికి నాలుగు నెలలు సమయం ఇవ్వాలని ఈపీఎఫ్ వోను గతేడాది నవంబర్ 4న సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం.. ఈ శుక్రవారంతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరో 2 నెలలు గడువు ఇచ్చారు.

EPFO New Guidelines : అధిక పింఛన్ పై ఈపీఎఫ్ వో కొత్త మార్గదర్శకాలు.. ఎవరు అర్హులు?

ఇక ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, కంపెనీలు కలిసి ఎలా దరఖాస్తు చేసుకోవాలో గత వారం ఈపీఎఫ్ వో పథకం కింద 2014ను గత ఏడాది సుప్రీంకోర్టు సమర్థించింది. 2014 ఆగస్టు 22న నెలసరి జీతం ఆధారంగా పెన్షన్ ఉన్న అర్హత పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000లకు సవరించింది. అదేవిధంగా ఈ పరిమితికి మించి వాస్తవ వేతనాల్లో సంస్థతో కలిసి 8.33 శాతం ఈపీఎస్ కు ఇచ్చేలా కూడా సభ్యులను అనుమతించారు.