EPFO Advance : గంటలోనే రూ.లక్ష అడ్వాన్స్.. కరోనా కాలంలో పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.

EPFO Advance : గంటలోనే రూ.లక్ష అడ్వాన్స్.. కరోనా కాలంలో పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Epfo

EPFO Medical Advance : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా చికిత్స లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ(అత్యవసర వైద్య అవసరాలు) పరిస్థితుల్లో పీఎఫ్ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) అకౌంట్ నుంచి లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చని ఈపీఎఫ్ తెలిపింది. అంతేకాదు ఈ సదుపాయాన్ని పొందేందుకు ఎలాంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం కూడా లేదంది.

జూన్ 1 ఈపీఎఫ్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. కరోనా సహా ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లయితే.. లక్ష రూపాయల వరకు మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఈపీఎఫ్ సభ్యుడు ఎలాంటి బిల్లు లేదా అంచనా వ్యయ వివరాలు చూపాల్సిన అవసరం లేదు. అంతేకాదు దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ చేస్తామంది.

ఇంతకుముందు, ఈపీఎఫ్ఓ మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం పీఎఫ్ ఖాతాను నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు అనుమతించింది. అయితే అది వ్యయ అంచనాల ఆధారంగా లేదా మెడికల్ బిల్స్ రీయింబర్స్‌మెంట్ తర్వాత మాత్రమే లభించేది. ఇప్పుడు మరింత వెసులుబాలు కల్పించింది.

మెడికల్ అడ్వాన్స్‌ తీసుకునేందుకు గైడ్ లైన్స్…
1. రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సిజిహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. అతన్ని అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే.. అప్పుడు ఓ అధికారి పూర్తిగా పరిశీలించి రిపోర్ట్ అందించిన తర్వాత మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు.

2. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా రోగి, అతన్ని చేర్పించిన ఆసుపత్రి వివరాలను తెలియజేస్తూ ఓ అప్లికేషన్‌ను సమర్పించాలి. అంచనా వ్యయం లేదని పేర్కొనాలి. దాంతో మెడికల్ అడ్వాన్స్ మంజూరు అవుతుంది.

3. మెడికల్ అడ్వాన్స్‌కు దరఖాస్తు చేసుకున్న గంటలోపే ఆ డబ్బు ఖాతాదారుడి అకౌంట్‌లోకి బదిలీ అవుతుంది.

4. ఈ మెడికల్ ఎమర్జెన్సీ అడ్వాన్స్ కొవిడ్ 19 అడ్వాన్స్ కు పూర్తి భిన్నమైంది. ఇందులో మొత్తం ఫండ్ లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.