EPFO 2nd Covid Advance : పీఎఫ్ నుంచి రెండోసారి కొవిడ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఖాతాదారులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ వేళ పీఎఫ్ ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ ముందుకొచ్చింది.

EPFO 2nd Covid Advance : పీఎఫ్ నుంచి రెండోసారి కొవిడ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు!

Epfo To Allow Second Covid 19 Advance Withdrawal

EPFO second Covid-19 advance withdrawal : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఖాతాదారులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ వేళ పీఎఫ్ ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ ముందుకొచ్చింది. రెండోసారి కొవిడ్-19 అడ్వాన్స్ ఇచ్చేందుకు అనుమతినిస్తోంది. మొదటిసారి కొవిడ్-19 అడ్వాన్స్ తీసుకున్నవారికి కూడా రెండోసారి అనుమతినిస్తోంది.

రెండో కొవిడ్ -19 అడ్వాన్స్‌ను మూడు నెలల వేతనాన్ని (బేసిక్ ప్లస్ డీఏ) లేదా మెంబర్ క్రెడిట్‌కు 75శాతం వరకు ఏది తక్కువ అయితే అది పొందవచ్చు. ఈ రెండింటి కంటే తక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మూడు రోజుల్లోనే సంబంధిత బ్యాంకుల్లో క్రెడిట్ అవుతుంది. ‘కేవైసీ’ పూర్తి చేసిన మెంబర్లకు సిస్టమ్ ఆధారంగా ఆటో-క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పాలసీని ప్రవేశపెట్టింది.

గత ఏడాది మార్చిలో మొదటిసారిగా కొవిడ్‌-19 అడ్వాన్స్‌ పొందే అవకాశాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది. ఇప్పుడు రెండోసారి కొవిడ్ అడ్వాన్స్త్ తీసుకునేందుకు అనుమతినిచ్చింది. తీసుకున్న మొత్తాన్ని ఈపీఎంఓకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.15 వేలలోపు జీతం ఉన్న ఉద్యోగులు ఈ అడ్వాన్స్‌ తీసుకోవచ్చు.

కరోనా సమయంలో ఖాతాదారులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం-1952లో సవరణ చేసింది.  ఇప్పటి వరకు ఈపీఎఫ్‌వో 76.31 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది.  గతంలో అడ్వాన్స్‌ తీసుకున్నవారూ రెండోసారి అడ్వాన్స్‌ పొందేందుకు అర్హులుగా పేర్కొంది. విత్ డ్రా ప్రక్రియ గతంలో మాదిరిగానే ఉంటుందని వెల్లడించింది. ఇప్పటివరకూ రూ.18,698.15 కోట్లను అడ్వాన్స్‌గా  చెల్లించింది.