Etah Temple : దుర్గాదేవికి మాస్క్, ప్రసాదంగా మాస్క్ లు

భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు.

Etah Temple : దుర్గాదేవికి మాస్క్, ప్రసాదంగా మాస్క్ లు

Durgadevi

Goddess Durga : ప్రపంచాన్ని ఇంకా కరోనా పట్టి పీడిస్తూనే ఉంది. లక్షలాది మంది చనిపోతున్నారు. భారతదేశంలో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నా..కొంతమంది ప్రజలు డోంట్ కేర్ అంటుండడంతో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో కరోనా అవగాహన కల్పించడం కోసం ఓ పూజారి వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా దుర్గాదేవి విగ్రహానికి మాస్క్ పెట్టడంతో అక్కడకు వచ్చే భక్తులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

అంతేగాకుండా…భక్తులకు ప్రసాదంగా మాస్క్ లు అందచేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటా నగరంలో ఇది చోటు చేసుకుంది. మాస్క్ వేసుకున్న దుర్గామాత ఫొటోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు. భక్తులలో కోవిడ్ నిబంధనల మీద అవగాహన కల్పించడానికి ఫేస్ మాస్క్‌లను ప్రసాదంగా గా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆలయంలో హ్యాండ్ శానిటై.జర్లు, పలుచోట్ల కొవిడ్ నిబంధనావళిని ఏర్పాటు చేశామన్నారు. ప్రజారోగ్యానికి ఎలాంటి హాని కలిగికుండా భక్తులు భాధ్యాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పూజారి చేస్తున్న ఈ పనికి పలువురు ప్రశంసలు తెలియచేస్తున్నారు.

Read More : Covid-19 Vaccines Supply : భారత్‌లో టీకాల కొరత.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది..