Ethanol Fuel: ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే వాహనాల ఇంజిన్స్ దెబ్బతింటాయా?
ఇథనాల్ లో ఉండే రసాయనిక చర్య వలన వాహనాల ఇంజిన్ లోని విడిభాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా వాహనాల కాలపరిమితి తగ్గిపోయే అవకాశం ఉంటుంది

Ethanol Fuel: భారత్ లో ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ మిశ్రమం ఉంటుంది. అందుకే ఈ రకమైన పెట్రోల్ రకాన్ని ‘ఈ10’గా పిలుస్తారు. అయితే రానున్న రోజుల్లో పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతంకు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపధ్యంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వలన వాహనాల ఇంజిన్ లు దెబ్బతింటాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే.. ఇథనాల్ లో ఉండే రసాయనిక చర్య వలన వాహనాల ఇంజిన్ లోని విడిభాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా వాహనాల కాలపరిమితి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈక్రమంలో పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని 10 నుంచి 20కి పెంచాలన్న ప్రభుత్వం నిర్ణయం వాహనదారుల్లో కాస్త ఆందోళన కలిగిస్తుంది.
Other Stories:Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
ప్రస్తుతం పెట్రోల్ దిగుమతులపై అధికంగా ఆధార పడ్డ భారత్..ఆమేరకు 85 శాతం దేశీయ అవసరాల నిమిత్తం ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని మరో పది శాతం పెంచడం ద్వారా చమురు దిగుమతుల్లో కొంత నష్టాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇథనాల్ 20 శాతం కలిపిన పెట్రోల్ రకాన్ని ‘ఈ20’గా పిలుస్తారు. 2030 వరకు ఈ20 రకాన్ని దేశీయంగా పంపిణీ చేయాలనీ మొదట లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఇప్పుడు 2025 నాటికే అందుబటులోకి తేవాలని నిర్ణయించింది. అయితే 2008 నుంచి తయారైన వాహనాలు ‘ఈ10’ రకం పెట్రోల్ ద్వారా నడిచేలా మార్పులు చేశాయి తయారీ సంస్థలు.
Other Stories:Air India Flight: గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్: అత్యవసరంగా దించేసిన పైలట్
ఈనేపధ్యంలో ఈ20 రకం పెట్రోల్ ప్రస్తుత వాహనాల్లో వాడితే ఇంజిన్ సామర్ధ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ10 ఇంధనానికి అలవాటు పడ్డ ఇంజిన్ ఈ20 ఇంధనాన్ని స్వీకరించలేదు. పైగా ఈ20లో ఉండే రసాయనాల కారణంగా ఇంజిన్ భాగాలూ దెబ్బతింటాయి. అందుకే E20 ఇంధనానికి అనుగుణంగా డిజైన్ మరియు మెటీరియల్ మార్పులు అవసరం. దీంతో ఈ20 రకం పెట్రోల్ కు సరిపడే ఇంజిన్స్ ను అభివృద్ధి చేయాలనీ కేంద్ర ప్రభుత్వం వాహన తయారీ సంస్థలకు సూచించింది. ఏప్రిల్ 2023 నుంచి ఈ కొత్త రకం ఇంజిన్స్ అందుబాటులోకి తెచ్చేందుకు వాహన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
1Telangana Covid Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
2Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
3Rahul Gandhi : కేరళలోని రాహుల్ గాంధీ ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడి
4మహా సంక్షోభంలో సెంటిమెంట్ పాలిటిక్స్
5ద్రౌపది కామెంట్లపై.. వెనక్కి తగ్గిన ఆర్జీవీ
6నిలిచిపోయిన మిషన్ భగీరథ నీరు
7అంబేద్కర్ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉంది
8అమలాపురంలో హై అలర్ట్ ..!
9సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం
10ప్రజల ఆకాంక్ష మేరకే కోనసీమ జిల్లా పేరు మార్పు
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!
-
AC Costlier : జూలై 1 నుంచి పెరగనున్న ఏసీల ధరలు.. ఎందుకో తెలుసా..!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ లీక్.. ఎప్పుడంటే?
-
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?