మీ అమ్మ, చెల్లి, అక్కలను ఇలాగే వేధిస్తావా ? పోకిరిని చితక్కొట్టిన అమ్మాయి

మీ అమ్మ, చెల్లి, అక్కలను ఇలాగే వేధిస్తావా ? పోకిరిని చితక్కొట్టిన అమ్మాయి

Women

eve teaser beaten : మహిళపై వేధింపులు ఆగడం లేదు. రోడ్డుపై వెళుతుంటే..టీజ్ చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతోంది. స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే వారిని వేధింపులకు గురి చేస్తూ..రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమిస్తున్నాంటూ..అదేరకంగా వేధిస్తుండడంతో తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా. ప్రతి రోజు టీజ్ చేస్తుండడంతో ఓ అమ్మాయికి చిర్రెత్తుకొచ్చింది. బడితె బట్టి భరతం పట్టింది. నడి రోడ్డుపై అందరి మధ్య చెంపదెబ్బలు కొట్టింది. అమ్మను, చెల్లె, అక్కను ఇదే విధంగా టీజ్ చేస్తావా అంటూ అపరకాళిలా మారిపోయింది. ఆమె ఆగ్రహానికి భయపడిపోయిన..ఆ ఈవ్ టీజర్ క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

మీరట్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డ రౌడీ తిక్క కుదిర్చింది ఓ అమ్మాయి. కర్రతో ఆ రౌడీని చితక బాదింది. బాలిక స్కూలుకు వెళ్తుంటే ప్రతిరోజు ఏదో ఒకటి టీజ్‌ చేయడం అతడికి రివాజుగా మారింది. అతగాడి ఈవ్‌టీజింగ్‌ను భరించలేక ఆ అమ్మాయి అపరికాళిలా విరుచుకుపడింది. స్థానికుల సమక్షంలోనే ఆ రౌడీకి దేహశుద్ధి చేసింది. పోలీసు ఎదుటే చెంప ఛెళ్లుమనిపించింది. ఈవ్‌ టీజర్ల మరోసారి అమ్మాయిల వైపు చూడకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పింది. స్థానిక పోలీసు ఈవ్‌ టీజర్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.