పాకిస్తాన్,ఆఫ్గనిస్తానే బెటర్…కేంద్రంపై రాహుల్ ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2020 / 04:44 PM IST
పాకిస్తాన్,ఆఫ్గనిస్తానే బెటర్…కేంద్రంపై రాహుల్ ఫైర్

Pak, Afghanistan handled Covid-19 better కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు Rahul Gandhi మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వం నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా భారత్ కన్నా బెటర్ గా కరోనాను కట్టడి చేస్తున్నాయంటూ శుక్రవారం కేంద్రంపై రాహుల్ మండిపడ్డారు.



కరోనా కట్టడిలో భారత్ కన్నా పాకిస్తాన్, అఫ్ఘానిస్తానే బెటర్‌గా పనిచేశాయంటూ.. మన పొరుగు దేశాల జీడీపీలను, మన దేశ జీడీపీని పోలుస్తూ ఐఎంఫ్ (International Monetary Fund) ఇచ్చిన అంచనాల గ్రాఫ్‌ను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది కూడా మోదీ సర్కార్ సాధించిన భారీ విజయం అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు. రాహుల్ షేర్ చేసిన IMF గ్రాఫ్‌లో బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, నేపాల్‌, చైనా, భూటాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇండియా దేశాల 2020-2021 జీడీపీ (GDP) లెక్క‌లు ఉన్నాయి.



అయితే ఈ ఏడాది భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 10.3 శాతం కుంచించుకుపోతుంద‌ని మంగళవారం ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ (IMF) పేర్కొన్న విష‌యం తెలిసిందే. బంగ్లాదేశ్.. తలసరి ఆదాయంలో భారత్‌ను అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్‌ అంచనాలను ప్రస్తావిస్తూ నిన్న కూడా కేంద్రంపై రాహుల్ విమర్శలదాడికి దిగిన విషయం తెలిసిందే.