ఉస్సేన్ బోల్ట్ కూడా తప్పించుకోలేడు.. ఇది వేట కాదు

ఉస్సేన్ బోల్ట్ కూడా తప్పించుకోలేడు.. ఇది వేట కాదు

గుజరాత్‌లోని మాధవ్‌పూర్ గ్రామంలో మనుషులు గుంపు మాట్లాడుకుంటూ ఉండగా ఏదో వీధి కుక్క పరిగెత్తినట్లు సింహం మధ్యలో వచ్చింది. సెకన్ల వ్యవధిలో అక్కడున్న వారంతా అలర్ట్ అయ్యారు. ఆ సింహం అక్కడున్న వారెవ్వరినీ పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. దీనిని ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్లో పోస్టు చేశారు. 

‘ఎవరైనా గంటకు 80కిలోమీటర్ల వేగంతో చేజింగ్ చేస్తుంటే ఉస్సేన్ బోల్ట్(గంటకు 38కిలోమీటర్లు వేగం)  కూడా తప్పించుకోలేడేమో.. సింహం బారి నుంచి అంటూ పోస్టు పెట్టాడు. ఈ పరిస్థితి మరెక్కడో కాదు.. గుజరాత్‌లోని మాధవ్‌పూర్‌లో జరిగింది’ అంటూ పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. గుజరాత్‌లో ఇటీవలి కాలంలో సింహాలు బయటే తిరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అది సింహం చేజింగ్ కాదు.. అక్కడి నుంచి పారిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చేసిన పనికి అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదంటూ మరో యూజర్ రిప్లై ఇచ్చారు. సింహం కూడా వీధుల్లో కుక్కలా పరిగెత్తుందంటూ ట్వీట్ చేశాడు మరో యూజర్. 

See Also | చలికాలంలో కరోనా ఉగ్రరూపం చూడాల్సిందేనా.. సైంటిస్టుల మాట