Rahul Gandhi : ఈవెంట్ ఖతం..వ్యాక్సినేషన్​ రికార్డ్​పై రాహుల్​ సెటైర్

వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Rahul Gandhi : ఈవెంట్ ఖతం..వ్యాక్సినేషన్​ రికార్డ్​పై రాహుల్​ సెటైర్

Rahul

Rahul Gandhi  వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఈవెంట్ ఖతం(ఈవెంట్ ముగిసింది)'”అని ఆదివారం రాహుల్ ఓ ట్వీట్ చేశారు.  10 రోజులుగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఎలా ఉందో తెలిపే కొవిన్​ వెబ్​సైట్​ గ్రాఫ్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు రాహుల్ గాంధీ.

గత శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్​ జరిగింది. ఒక్కరోజే 2. 5 కోట్ల మందికి టీకాలిచ్చారు. రికార్డు పంపిణీ అనంతరం శనివారం వ్యాక్సినేషన్​ ప్రక్రియ పడిపోవడమేంటని రాహుల్ ప్రశ్నించారు.

శుక్రవారంతో పోల్చితే శనివారం వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తారని భావించినట్లు రాహుల్ ట్వీట్​లో పేర్కొన్నారు. 2.1 కోట్ల డోసులు మళ్లీ ఎప్పుడిస్తారో అని వేచిచూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థాయిలో వాక్సిన్ పంపిణీ జరగడం చాలా అవసరమని గుర్తుచేశారు.

READ Vaccination Record: మోడీ పుట్టినరోజు నాడే దేశంలో వ్యాక్సినేషన్ రికార్డ్..

READ Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్ సింగ్ చన్నీ