ఎలక్షన్ అంటే..గాంధీ కుటుంబానికి పిక్నిక్: ఫోజులే పసలేదు

ఎలక్షన్ అంటే..గాంధీ కుటుంబానికి పిక్నిక్: ఫోజులే పసలేదు

ఎలక్షన్ అంటే..గాంధీ కుటుంబానికి పిక్నిక్: ఫోజులే పసలేదు

లక్నో : ప్రియాంక గంగాయాత్రను పిక్నిక్ లాంటివానీ..బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏవైనా సరే అవి  గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటివేననీ..ఎన్నికల ప్రకటన రాగానే వాళ్లు విదేశాల నుంచి వచ్చి..అన్ని ప్రదేశాలు చూసి తమ వాక్చాతుర్యాన్ని ప్రజల ముందు ప్రదర్శిస్తారని తరువాత కనిపించకుండా పోతారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు పూర్తికాగానే స్విట్జర్లాండ్ లేదంటే ఇటలీకి వెళ్లిపోతారంటు యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ విమర్శలు గుప్పించారు.
Read Also : మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

ఎప్పుడైన కొత్తగా ఎన్నికల ప్రకటన రాగానే కొత్తగా గాంధీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తారనీ..తన నాయకత్వంలో అద్భుతాలు జరుగుతాయన్నట్లుగా ఫోజులు కొడతారని..కానీ ఎవ్వరికి పస లేదనీ ఎద్దేవా చేశారు. ప్రియాంక యూపీలో గతంలోనూ ప్రచారం చేశారు కానీ ఏమైంది? ఆమె ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి ఏం ఒరిగింది? ఓటమి మూట కట్టుకోవడం తప్ప..అంటూ దినేశ్‌వర్మ ఎద్దేవా చేశారు.

యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్ర‌తో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు  బోటో ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారం కొనసాగి వార‌ణాసిలోని అసి ఘాట్ వ‌ద్ద ప్ర‌చారం ముగియనుంది. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ బోట్ ప్రచారంపై  దినేశ్‌వర్మ విమర్శలు సంధించారు.

×