ఆత్మగౌరవం ఉన్న మహిళలు బీజేపీని బహిష్కరించాలి

  • Published By: vamsi ,Published On : October 26, 2019 / 02:33 AM IST
ఆత్మగౌరవం ఉన్న మహిళలు బీజేపీని బహిష్కరించాలి

హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓ క్రిమినల్‌ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఆత్మ ఆత్మగౌరవం ఉన్న మహిళలు బీజేపీని బహిష్కరించాలంటూ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ. మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను, వారిని ప్రోత్సహిస్తున్న పార్టీని ఆత్మగౌరవం ఉన్న మహిళలు బహిష్కరించాలని ప్రియాంకగాంధీ మహిళలకు పిలుపునిచ్చారు.

‘‘మొదట కుల్దీప్ సింగ్ సెంగార్.. తర్వాత స్వామి చిన్మయానంద, ఇప్పుడు గోపాల్ కందా.. ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారతీయ మహిళ బీజేపీని, ఆ పార్టీ నాయకులను బహిష్కరించాలి. బీజేపీ నేతలు ఎప్పుడైనా మహిళలను గౌరవించారా?’’ అంటూ ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు.

ఉన్నావోలో ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ నిందితుడు. ఆయనను అరెస్టు చేశాక, బీజేపీ అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నాయకుడైన స్వామి చిన్మయానంద ఓ న్యాయ విద్యార్థినిని లైంగికంగా వేధించి అరెస్టయ్యారు. 2012లో తన విమానయాన సంస్థలో పనిచేసిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణం అనే ఆరోపణలు ఉండగా.. ఇప్పుడు అతని మద్దతుతో హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

2012లో తన విమానయాన సంస్థలో పనిచేసిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు కారణం గోపాల్ కందా అనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలల తరువాత, ఆమె తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే లేటెస్ట్‌గా జరిగిన ఎన్నికల్లో గోపాల్ కందా గెలిచాడు.  సిర్సా అసెంబ్లీ సీటు నుంచి 602ఓట్ల తేడాతో గోపాల్ కందా ఈ ఎన్నికల్లో నెగ్గాడు.