Smriti Irani: ప్రతి వ్యక్తినీ హింసాత్మకంగా, రేపిస్ట్‌గా పరిగణించకూడదు- స్మృతి ఇరానీ

మహిళలు, పిల్లల సంరక్షణ అనేది దేశంలో ప్రాధాన్యమిచ్చే అంశమే కానీ, అలా అని ప్రతి వివాహం హింసాత్మకమైనది, ప్రతి మగాడిని రేపిస్ట్‌గా పరిగణించడం అనేది కరెక్ట్ కాదని...

Smriti Irani: ప్రతి వ్యక్తినీ హింసాత్మకంగా, రేపిస్ట్‌గా పరిగణించకూడదు- స్మృతి ఇరానీ

smriti-irani

Smriti Irani: మహిళలు, పిల్లల సంరక్షణ అనేది దేశంలో ప్రాధాన్యమిచ్చే అంశమే కానీ, అలా అని ప్రతి వివాహం హింసాత్మకమైనది, ప్రతి మగాడిని రేపిస్ట్‌గా పరిగణించడం అనేది కరెక్ట్ కాదని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభ వేదికగా బుధవారం వెల్లడించారు. సీపీఐ లీడర్ బినోయ్ విశ్వం ప్రశ్నకు గానూ స్పందించి ఇలా బదులిచ్చారు. గృహహింస చట్టంలోని సెక్షన్-3తో పాటు అత్యాచారంపై ఐపీసీ సెక్షన్ 375ని ప్రభుత్వం దృష్టికి తీసుకుందా.. లేదా అని తెలుసుకోవాలని కోరారు.

‘భారతదేశంలో జరిగే ప్రతి వివాహాన్ని హింసాత్మకంగా భావించడం, ప్రతి వివాహితుడ్ని రేపిస్టుగా పరిగణించడం కరెక్ట్ కాదని’ ఇరానీ అన్నారు. ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న అంశంపై వివరణాత్మకంగా మాట్లాడటానికి రాజ్యసభ నిబంధనావళిలోని రూల్ 47 ప్రకారం అనుమతి లేదని సీనియర్ సభ్యునికి తెలుసుని అన్నారు.
దేశంలోని మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్రాల సహకారంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్ సెంటర్లు పని చేస్తున్నాయని, వాటి ద్వారా దాదాపు 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని చెప్పారు. 703 వన్ స్టాప్ సెంటర్ల ద్వారా 5 లక్షల మందికిపైగా మహిళలు సహాయం పొందారని వివరించారు.

Read Also : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన అనేక పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణలు జరుగుతున్నాయి.