Monkeypox: భారత్‌కు మంకీపాక్స్ టీకా ఎప్పుడొస్తుంది? అందరూ తీసుకోవాలా?

ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో టీకా తయారీకి సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా అనే అంశాలను సంస్థ సీఈఓ వెల్లడించారు.

Monkeypox: భారత్‌కు మంకీపాక్స్ టీకా ఎప్పుడొస్తుంది? అందరూ తీసుకోవాలా?

Monkeypox (2)

Monkeypox: ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేలకు పైగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్ లోనూ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదవ్వడంతో కేంద్రం అప్రమత్తమైంది. అయితే మంకీపాక్స్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సిన్ ను తయారుచేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Monkeypox: “ప్రాణాంతక వ్యాప్తిని అడ్డుకోవడానికి సిద్ధం కావాలి”

మంకీపాక్స్ వ్యాక్సిన్ పంపిణీ అనివార్యమైన తరుణంలో దీనిని దిగుమతి చేసుకునేందుకు డెన్మార్క్ కు చెందిన సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్లు సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ప్రస్తుతం మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు స్మాల్ పాక్స్ ను ఎదుర్కొనే టీకానే డెన్మార్క్ కు చెందిన బవారియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసింది. పలు బ్రాండ్ల పేరుతో అమెరికా, యూరప్ దేశాల మార్కెట్ లలో ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే మంకీపాక్స్ కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేనప్పటికీ స్మాల్ పాక్స్ కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ నే మంకీపాక్స్ నిరోధానికి ఆయా దేశాలు అనుమతిస్తున్నాయి.

Monkeypox: హమ్మయ్య నెగిటివ్ వచ్చింది.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ లేదు..

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీపై సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా మాట్లాడుతూ.. భారత్ లో మంకీపాక్స్ గురించి ప్రస్తుతానికి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంకీపాక్స్ నిరోధానికి టీకాను అభివృద్ధి చేసే విషయంపై మరికొన్ని నెలలపాటు వేచిచూసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే స్థానికంగా తయారీ ఇప్పుడు మొదలు పెడితే మార్కెట్ లోకి రావడానికి ఏడాది సమయం పడుతుందని తెలిపారు. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అందరికీ ఈ వ్యాక్సిన్ అవసరం ఉండదని, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లోని వారికి అందిస్తే సరిపోతుందని ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.