సయ్యద్ సంగతి చూడండి : ఈవీఎం హ్యాకింగ్‌పై ఈసీ ఫిర్యాదు

ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి యూఎస్ సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 03:57 AM IST
సయ్యద్ సంగతి చూడండి : ఈవీఎం హ్యాకింగ్‌పై ఈసీ ఫిర్యాదు

ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి యూఎస్ సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్

ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి యూఎస్ సైబర్ ఎక్స్‌పర్ట్ సయ్యద్ షుజా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని, రిగ్గింగ్‌తోనే బీజేపీ గెలిచిందని సయ్యద్ సంచలన ఆరోపణలు చేశాడు. లండన్‌లో మీడియా సమావేశంలో అమెరికా నుంచి స్కైప్ ద్వారా మాట్లాడిన సయ్యద్ షుజా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని చెప్పాడు. దీంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ దుమారం లేచింది. సయ్యద్ ఆరోపణలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ మ్యాటర్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది. చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

 

తనను తాను సైబర్‌ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్‌పై ఢిల్లీ పోలీసులకు ఈసీ ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయాలంది. ఈవీఎంలను తారుమారు చేస్తానని సవాల్ విసిరిన సయ్యద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 2019, జనవరి 21వ తేదీ సోమవారం లండన్‌లో సయ్యద్ చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలంది. అమెరికాలో రాజకీయ శరణార్థిగా ఉన్నానన్న సయ్యద్ ప్రజల్లో భయాందోళనలు కలిగించే వదంతుల వ్యాప్తి ద్వారా ఐపీసీ సెక్షన్ 505(1)ని ఉల్లంఘించాడని ఈసీ తెలిపింది.

 

లండన్‌లో భారత మీడియాతో సమావేశంలో స్కైప్‌ ద్వారా సయ్యద్ షుజా మాట్లాడాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను అభివృద్ధి చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పాడు. 2009 నుంచి 2014 వరకూ తాను ఆ సంస్థలో పనిచేశానని తెలిపాడు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా అన్నది పరిశీలించాలని ఈసీఐఎల్‌ తన బృందాన్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని చెప్పాడు. తన ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని, ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే హ్యాకింగ్‌ తీరును వివరిస్తా అంటూ సంచలన ప్రకటన చేశాడు. ఈసీ 2014 సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను రిగ్గింగ్ చేసినట్లు సయ్యద్ ఆరోపించాడు.

 

ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని ఈసీ మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)తయారు చేస్తాయని.. అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించి, అన్ని ప్రామాణిక ప్రక్రియలను పరిశీలిస్తారని వివరణ ఇచ్చింది. ఈవీఎంల పరిశీలనకు 2010లోనే ఒక అత్యున్నత సాంకేతిక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపింది.