బాప్ రే : హోటల్‌లో ఈవీఎంలు, వీవీ ప్యాట్

బీహార్ : ఈవీఎంల పనితీరుపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 08:25 AM IST
బాప్ రే : హోటల్‌లో ఈవీఎంలు, వీవీ ప్యాట్

బీహార్ : ఈవీఎంల పనితీరుపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా

బీహార్ : ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఎన్నికల అధికారులు.. ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఈవీఎంలపై మరిన్ని సందేహాలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ లో కలకలం రేగింది. ఓ హోటల్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ దర్శనం ఇచ్చాయి. ఛోటీ కళ్యాణి ప్రాంతంలో పోలింగ్‌ సమయంలో ఓ హోటల్‌ నుంచి 6 ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈవీఎంలు హోటల్‌కి ఎలా చేరుకున్నాయన్న దానిపై అనేక అనుమానాలు తలెత్తాయి.

ఈవీఎం కస్టోడియన్‌ సెక్టార్‌ మేజిస్ట్రేట్ అవధేష్‌ కుమార్‌ ఈవీఎంలను హోటల్‌కు తీసుకెళ్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలింగ్‌ విధుల్లో నిర్లక్ష్యం​ వహించిన అవధేష్‌ కుమార్‌కు ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. తన డ్రైవర్‌ ఓటు వేసేందుకు వెళ్లడంతో ఈవీఎంలు, వీవీప్యాట్‌ను అవధేష్ హోటల్ కి తీసుకెళ్లినట్లు జిల్లా కలెక్టర్‌ అలోక్‌ రంజన్‌ ఘోష్‌ నిర్ధారించారు. ఈవీఎంలను హోటల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం తెలియగానే అక్కడ గుమికూడిన స్ధానికులు మేజిస్ట్రేట్‌ తీరును తప్పుపడుతూ నిరసన తెలిపారు. ఈవీఎంలను వాహనం నుంచి హోటల్‌లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అధికారికి ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. బయటకు వచ్చిన ఈవీఎంలను సీజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.