హాట్ టాపిక్ : కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించిన మాజీ సీఎం 

  • Edited By: veegamteam , September 4, 2019 / 09:53 AM IST
హాట్ టాపిక్ : కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించిన మాజీ సీఎం 
ad

రాజకీయంలో అపారమైన అనుభవం కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్యది. అంతటి అనుభవం ఉన్న నేతకు అసహనం కూడా ఎక్కువే. దీంతో ఆయన తరచు వార్తలోకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య మరోసారి సహనం కోల్పోయి వార్తలోకెక్కారు.  

మైసూర్ ఎయిర్ పోర్ట్ లో తన సొంతపార్టీ కార్యకర్తపైనే చేయి చేసుకున్న ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సిద్ధరామయ్యకు  ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చిన సదరు కార్యకర్త ఆయనకు ఇచ్చేందుకు యత్నించాడు. దీంతో సిద్ధరామయ్యకు కోపమొచ్చింది. ఫోన్ ఇవ్వబోతున్న వ్యక్తి చెంపపై ఒక్కటిచ్చారు. ఇదంతా అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇది వైరల్ గా మారింది. 

కాగా ఎయిర్ పోర్ట్ లో సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడిన తరువత కూడా సిద్ధరామయ్యకు విసుగుపుట్టించేలా ఆ వ్యక్తి ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. అనుచరుడి ప్రవర్తన నచ్చని చిరాకుడపడి అతని చెంపపై గట్టిగా కొట్టారు.  గతంలో కూడా సిద్ధరామ్య అసహనంతో కొందరిపై చేయి చేసుకున్న ఘటనలున్నాయి. 

మరోవైపు కర్నాటకలో మైసూరు, కొడగు పర్యటనలో వరద అనంతర పరిస్థితిని సమీక్షించిందేకు మాజీ సీఎం బయల్దేరారు. అయితే కాంగ్రెస్ నేత ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ అరెస్టుతో … సిద్ధరామయ్య సందర్శన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. శివకుమార్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ..పలువురు కార్యకర్తలు ఆయన నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. మరికొందరు మైసూరు వచ్చిన సిద్ధరామయ్యను కలిసేందుకు భారీగా ఎయిర్ పోర్టు వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య తీవ్ర అసహనానికి గురైన సమయంలో సదరు కార్యకర్తపై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.