Gang Rape : దారుణం.. భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్.. ఈ నీచానికి పాల్పడింది..

రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఐదుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆమె భర్తను కట్టేసి మరీ దారుణానికి తెగించారు. తన కళ్ల ముందే భార్యను అత్యాచారం చేయడంతో అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి బాధితురాలికి తెలిసిన వాడే.

Gang Rape : దారుణం.. భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్.. ఈ నీచానికి పాల్పడింది..

ex husband brother gang rape woman: రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఐదుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆమె భర్తను కట్టేసి మరీ దారుణానికి తెగించారు. తన కళ్ల ముందే భార్యను అత్యాచారం చేయడంతో అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి బాధితురాలికి తెలిసిన వాడే. స్వయాన ఆమెకు మరిది అవుతాడు. ఆమె మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారి కావడం శోచనీయం.

బరన్ జిల్లాలో దంపతులు కాపురం ఉంటున్నారు. శనివారం బాలాజీ ఆలయానికి వెళ్లారు. బైక్ పై ఇంటికి తిరిగొస్తుండగా బరన్‌-అత్రు రాష్ట్ర రహదారిపై ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. వారిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భర్తను బెదిరించి, భయపెట్టి దాడి చేశారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. అతడి ముందే ఆ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి బాధితురాలికి తెలిసిన వాడే కావడం గమనార్హం. తన మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారి కావడం శోచనీయం. ఈ ఘటన గురించి చెప్తే మీ పరువే పోతుందని, ఆలోచించుకోమని చెప్పి మరీ వెళ్లాడా నీచుడు. షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు.. తన భర్తతో కలిసి సర్దార్ పోలీస్ స్టేషన్ లో మరిది దినేష్ పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో మహిళ, ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తాజా ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.