Sixth Marriage : ఆరో పెళ్ళికి సిద్దమైన మాజీ మంత్రి.. భార్య ఫిర్యాదుతో ఏమైందో తెలుసా?

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరో పెళ్ళికి సిద్ధమవుతుండగా మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లి ఆగిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరోపేళ్ళి చేసుకుంటుండగా మూడవ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Sixth Marriage : ఆరో పెళ్ళికి సిద్దమైన మాజీ మంత్రి.. భార్య ఫిర్యాదుతో ఏమైందో తెలుసా?

Sixth Marriage

Sixth Marriage :  ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆరో పెళ్ళికి సిద్ధమవుతుండగా మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన చౌదరి బషీర్.. మాయావతి సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు.. ఆ తర్వాత ఎస్పిలో చేరాడు.

అక్కడ ఇమడలేక పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక రాజకీయాలకు దూరమైన మంత్రి పెళ్లి చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటికి ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆరో పెళ్ళికి సిద్ధమవుతుండగా మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మీడియా నివేదిక ప్రకారం మూడో భార్య నగ్మా ఆగ్రా మాజీ మంత్రి ఆరవ వివాహం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు, ఆమె అతని వద్దకు వెళ్లింది. అతను తనపై దాడి చేశాడని, ట్రిపుల్ తలాక్ ద్వారా తనతో విడాకులు తీసుకున్నాడని ఆమె పేర్కొంది. ఆరో పెళ్లిని వ్యతిరేకిస్తుందని మూడో భార్య నగ్మాను ఇంటి నుంచి తరిమేశాడు. 2012 లో బషీర్ తనను వివాహం చేసుకున్నారని, తమకు ఇద్దరు కుమారులు ఉన్నారని నగ్మా చెప్పారు.

వివాహం చేసుకున్న తర్వాత తన భర్త అతని సోదరి తనను మానసికంగా మరియు శారీరకంగా హింసించారని, కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో బషీర్ 23 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. కాగా నగ్మా ఫిర్యాదుతో ఐపిసి సెక్షన్ 504 ముస్లిం మహిళల వివాహ చట్టం, 2019 పై హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీస్ కేసు నమోదు కావడంతో పెళ్లి నిలిచిపోయింది.