Lemon Therapy : ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదు, బీజేపీ నేత ఉచిత సలహా

ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వినిపిస్తే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. కోవిడ్ దెబ్బకు జనాలు ప్రాణభయంతో బతుకుతున్నారు. అయితే కరోనా ప్రాణాంతకం కాదు, సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే, మనోధైర్యంతో ఉంటే, కరోనాను జయించడం చాలా తేలిక అని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికి కొందరిలో కరోనా భయం పోవడం లేదు. తాము కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత వైద్యం ఫాలో అవుతున్నారు. వాళ్లు చెప్పినవి, వీళ్లు చెప్పినవి, సోషల్ మీడియాలో చూసినవి ఫాలో అయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Lemon Therapy : ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదు, బీజేపీ నేత ఉచిత సలహా

Lemon Therapy

Lemon Therapy : ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వినిపిస్తే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. కోవిడ్ దెబ్బకు జనాలు ప్రాణభయంతో బతుకుతున్నారు. అయితే కరోనా ప్రాణాంతకం కాదు, సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే, మనోధైర్యంతో ఉంటే, కరోనాను జయించడం చాలా తేలిక అని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికి కొందరిలో కరోనా భయం పోవడం లేదు. తాము కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత వైద్యం ఫాలో అవుతున్నారు. వాళ్లు చెప్పినవి, వీళ్లు చెప్పినవి, సోషల్ మీడియాలో చూసినవి ఫాలో అయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కర్నాటకలో ఓ టీచర్ ఇలానే ఇంటి వైద్యం ఫాలో అయ్యి ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదని నమ్మిన ఆయన ముక్కులో నిమ్మరసం చుక్కలు వేసుకున్నాడు. అంతే, అది కాస్తా వికటించి ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఆయనకు ఈ సలహా ఎవరిచ్చారో తెలీదు కానీ, పాపం టీచర్ బలైపోయాడు.

కాగా, ఇలాంటి సలహానే ఓ బీజేపీ నేత నాలుగు రోజుల క్రితం ఇచ్చాడు. ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదు. ఇదెవరో శాస్త్రవేత్తలో, లేక డాక్టర్ లో లేక ప్రభుత్వాలో చెప్పిన మాట కాదు. ఓ బీజేపీ నేత ఇచ్చిన ఉచిత సలహా. ”కేవలం రెండు నిమ్మరసం చుక్కలు ముక్కులో వేసుకుంటే చాలు.. మీ బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ పెరుగుతాయి. ఈ నిమ్మరసం చుక్కలు కరోనాను కూడా అడ్డుకుంటాయి” అని బీజేపీ నేత విజయ్ శంకేశ్వర్ చెప్పారు. బీజేపీ నేత ఉచిత సలహా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విమర్శలు వస్తున్నాయి. మీలాంటి వారి వల్లే అమాయకులైన ప్రజలు నిజమేనేమో అని నమ్మి ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతున్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో సొంత వైద్యం వద్దని పెద్ద పెద్ద డాక్టర్లు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నారు. అయినా కొందరు వ్యక్తులు మనుషులను చంపే సలహాలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బీరు తాగితే కరోనా రాదు, పసుపు తింటే కరోనా రాదు, ఎండలో తిరిగేటోళ్లకు అస్సలే రాదని.. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు పెద్ద పెద్ద డాక్టర్లను మించి చదివినట్లు సలహాలు ఇచ్చేస్తున్నారు. అవి గుడ్డిగా నమ్మిన పబ్లిక్ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి జాగ్రత్త అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుడ్డిగా ఏది పడితే అది నమ్మొద్దని సూచిస్తున్నారు.