ఓటు వేసిన మాజీ ప్రధాని, మాజీ సీఎంలు

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 10:26 AM IST
ఓటు వేసిన మాజీ ప్రధాని, మాజీ సీఎంలు

మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూబా ముఫ్తీ అనంతనాగ్ జిల్లాలోని బిజ్బీహారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన 37డి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 

కాగా జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడవ దశలో అనంతనాగ్ పార్లమెంట్ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. కాగా పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి మందకొడిగానే ఉంది.జమ్ముకశ్మీర్‌లో అనంతనాగ్ అత్యంత సున్నిత ప్రాంతంగా పేరొందింది. దీంతో ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ స్థానం నుంచి పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో పాటు మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లోని ఓటర్లు ఓటువేసేందుకు పెద్దగా ఆసక్తి చూపటంలేదని  అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసుల వినతి మేరకు ఎన్నికల కమిషన్ అనంతనాగ్‌లో పోలింగ్ సమయాన్ని రెండు గంటలు తగ్గించింది. దీంతో దక్షిణ కశ్మీర్‌లో ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది.