అసలు నిజం ఇదే : ఆ MLA కారులో రూ.20వేల కోట్లు!

కారులో భారీ నగదు పట్టుబడినట్టు వార్త హల్ చల్ చేసింది. కారులో రూ.20వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

  • Published By: sreehari ,Published On : April 15, 2019 / 01:25 PM IST
అసలు నిజం ఇదే : ఆ MLA కారులో రూ.20వేల కోట్లు!

కారులో భారీ నగదు పట్టుబడినట్టు వార్త హల్ చల్ చేసింది. కారులో రూ.20వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ బ్లాక్ మనీని కట్టడి చేసేందుకు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతోంది. అనుమానం వచ్చిన ప్రతిచోట సోదాలు నిర్వహిస్తోంది. కార్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏది కనిపించినా వదలకుండా తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో కోట్లాది నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. పట్టుబడిన నోట్ల కట్టలు పలానా పార్టీకి చెందినవని, ఆ పార్టీ ఎమ్మెల్యే.. ఈ పార్టీ ఎమ్మెల్యేకి చెందిన నగదు అంటూ క్షణాల్లో సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఎప్పటివో పాత ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఏది నిజం.. ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫొటో అందరిని షాక్ కు గురిచేస్తోంది. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ గడ్గిల్ కు సంబంధించిన కారులో భారీ నగదు పట్టుబడినట్టు వార్త హల్ చల్ చేసింది. కారులో రూ.20వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ రెండు ఫొటోలు కలిపి ‘కాంగ్రెస్ సమర్థక్’ అనే ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసి.. బీజేపీ నేత సుధీర్ గడ్గిల్ కారులో రూ.20వేల కోట్లు పట్టుబడినట్టు హిందీలో క్యాప్షన్ పెట్టారు. ఫేస్ బుక్ యూజర్లు సునీల్ కుమార్ సర్కార్, హరి మండియా కామ్రేడ్ .. వీరిద్దరూ కూడా ఈ ఫొటోలను తమ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ పోస్టును ఒకరినుంచి మరొకరు..షేర్ చేయడంతో.. లక్ష సార్లు ఫేస్ బుక్ లో షేర్ అయినట్టు గుర్తించారు. 

ఇంత భారీ మొత్తంలో నగదును ఇటీవలే పట్టుబడినట్టుగా అందరిని నమ్మించేలా ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకునేందుకు యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూం (AFWA)బృందం రంగంలోకి దిగింది. జనాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించేలా ఉన్న వైరల్ ఫొటోలపై లోతుగా విచారించింది. ఈ విచారణలో ఈ రెండు ఫొటోలు పాతవని, రెండెంటికి ఒకదానితో ఒకటి సంబంధం లేదని తేల్చేసింది. అంటే.. ఈ రెండు ఫొటోలు ఫేక్ అని తేలింది.  

రెండు ఫొటోలు ఫేక్..  ఎలా గుర్తించారంటే : 
* ఒక ఫొటోలో 5గురు సివిల్ డ్రెస్ లో నిలబడి ఉన్నారు. కారు వెనుక భాగంలో కొన్ని ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నాయి. దీనిపై ఆరా తీస్తే.. ఈ ఫొటో నవంబర్ 2016 నాటి ఫొటోగా గుర్తించారు. మహారాష్ట్ర ఉస్మాన్ బాద్ జిల్లాకు చెందిన ఎన్నికల అధికారులు ఓ కారులో రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు సంగ్లీలోని అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకుకు చెందినదిగా గుర్తించారు. గణేశ్ గడ్గిల్ కు చెందిన బ్యాంకు కాగా, ఆయన.. సుధీర్ గాడ్గిల్ కు సోదరుడుగా నివేదికలో తేలింది. ఈ ఘటన 2016, నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న ఈ కోట్ల నగదులో రూ.60వేలు వంద నోట్లు, 88వేలు రూ.500 నోట్లు, పది వేలు రూ.వెయ్యి నోట్లు ఉన్నాయి. ఈ ఘటనను అప్పట్లో చాలా మీడియా ఛానళ్లు కవర్ చేశాయి.   

2. ఫొటో : 

బండెల్స్ లో కరెన్సీ నోట్లు కుప్పలుగా పడి ఉన్న మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కారు బోర్డు బాక్సుల్లో రూ.200, రూ.500, రూ.2వేలు నోట్లు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఫొటో నవంబర్ 2017 లో జరిగిన ఘటనకు సంబంధించినది. సంగ్లీ నగదు పట్టివేత జరిగిన ఏడాదికి ఈ ఘటన జరిగింది. 

* ఆదాయ పన్ను శాఖ అధికారులు ఢిల్లీలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE)బ్రోకర్ సంజయ్ గుప్తా నివాసంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. OPG గ్రూపుకు సంబంధించిన కేసులో ఈ నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి చాలా వార్త ప్రత్రికల్లో, మీడియా ఛానళ్లలో కవర్ చేయడం జరిగింది. వైరల్ అయిన ఈ ఫొటో కూడా ఫేక్ అని తెలిపోయింది. ఈ రెండు ఫొటోలు వేర్వేరు సంఘటనలు, ఒకదానితో మరొకటి అసలు సంబంధమే లేదని తేలింది.