Sputnik Light : డాక్టర్ రెడ్డీస్‌కు మరో ఛాన్స్.. భారత్‌లో రష్యా ట్రయల్ డేటాతో అప్లయ్ చేయొచ్చు..!

భారత్‌లో సింగిల్-డోస్ రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ ట్రయల్స్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డిస్ కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (CDSCO) మరో అవకాశం కల్పించింది.

Sputnik Light : డాక్టర్ రెడ్డీస్‌కు మరో ఛాన్స్.. భారత్‌లో రష్యా ట్రయల్ డేటాతో అప్లయ్ చేయొచ్చు..!

Expert Panel Allows Dr Reddy's To Submit Russian Trial Data For Nod To Sputnik Light

Dr Reddy Russian trial data for Sputnik Light : భారత్‌లో సింగిల్-డోస్ రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ ట్రయల్స్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డిస్ కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (CDSCO) మరో అవకాశం కల్పించింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ పై మూడో దశ ట్రయల్స్‌కు సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (CDSCO) నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి భారత్‌లో మరోసారి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని SEC తెలిపింది. రష్యాలో నిర్వహించిన మూడోదశ ట్రయల్స్ డేటాతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదే విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.

భారతదేశంలో రష్యా స్పుత్నిక్ లైట్ టీకా కోసం ప్రత్యేక మూడో దశ ట్రయల్ నిర్వహించాల్సి ఉంది. ఫేజ్-3 రష్యన్ ట్రయల్స్ నుంచి వచ్చిన డేటా సరిపోతుందని నిపుణుల ప్యానెల్
అభిప్రాయపడింది. రష్యాలో జరుగుతున్న స్పుత్నిక్ లైట్ దశ -3 క్లినికల్ ట్రయల్, భద్రత, రోగనిరోధక శక్తి సమర్థత డేటాను సంస్థ సమర్పించాలని కమిటీ సిఫార్సు చేసిందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. స్పుత్నిక్ లైట్, స్పుత్నిక్-వి కాంపోనెంట్-1 కు సమానమని కమిటీ గుర్తించింది. సంస్థ ఇప్పటికే దేశంలో కాంపోనెంట్ -1 భద్రత ఇమ్యునోజెనిసిటీని ఉత్పత్తి చేసింది. రష్యాలో ఫేజ్ -3 ఎఫిషియసీ ట్రయల్ కొనసాగుతోందని, సమర్థత డేటా ఇంకా ఉత్పత్తి కాలేదని కమిటీ గుర్తించింది.

రెండు డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF).. ఒకే డోసు స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ రూపొందించింది. ఇప్పటికే రష్యాలో ఈ టీకాకు అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్-19ను కంట్రోల్ చేయడంలో ఒకే డోసు వ్యాక్సిన్ 79.4శాతం ప్రభావంతంగా ఉందని RDIF పేర్కొంది. రష్యా, యూఏఈ వంటి దేశాల్లో 7వేల మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో రెండు-మోతాదుల వ్యాక్సిన్ స్పుత్నిక్ V అత్యవసర వినియోగానికి ఆమోదం కోసం డాక్టర్ రెడ్డీస్.. భారత్‌లోని 1,600 మంది వాలంటీర్లపై దశ II / III అధ్యయనం నిర్వహించారు.