భారత్ బయోటిక్ ‘కొవాక్జిన్‌’ వాక్సిన్‌కు లైన్ క్లియర్!

భారత్ బయోటిక్ ‘కొవాక్జిన్‌’ వాక్సిన్‌కు లైన్ క్లియర్!

భారత్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) ప్యానెల్ భారత్ బయోటెక్ రూపొందించిన స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్  అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని సిఫారసు చేసింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాక్జిన్‌ను అత్యవసర వినియోగ అధికారం కోసం పెట్టుకున్న దరఖాస్తును భారత ఔషధ నియంత్రక మండలి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సమీక్షించింది.

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. అత్యవసర వినియోగ అనుమతి కోసం సిఫారసు చేయబడిన రెండవ కోవిడ్ -19 టీకా ఇది. వ్యాక్సిన్ అభ్యర్థులకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCIG) తుది అనుమతి ఇస్తుంది. భారత్‌‌లో కోవిషీల్డ్ వ్యాక్సీన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది.

భారతీయ కౌన్సిల్‌ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), భారత్‌ బయోటెక్‌ సంయుక్త భాగస్వామ్యంతో మొట్టమొదటి స్వదేశీ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కొవాక్జిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసుతో దాదాపుగా ‘కొవాక్జిన్‌’ వాక్సిన్‌కు లైన్ క్లియర్ అయినట్లే అని విశ్లేషకులు అంటున్నారు.

అంతకుముందు కోవిషీల్డ్‌ను కూడా సిఫారసు చెయ్యగా.. ఇప్పుడు రెండు టీకాలు దేశంలోని డ్రగ్ కంట్రోలర్‌కు పంపబడతాయి. అనగా డిసిజిఐ విజి సోమానీ తుది ఆమోదం కోసం. ఈ టీకాల అత్యవసర వినియోగానికి ఆయన అనుమతిస్తారు.