కరోనా ఎఫెక్ట్ : హోలీ వేడుకలొద్దంటూ సుప్రీంకోర్టులో పిటీషన్

  • Published By: vamsi ,Published On : March 4, 2020 / 09:28 AM IST
కరోనా ఎఫెక్ట్ : హోలీ వేడుకలొద్దంటూ సుప్రీంకోర్టులో పిటీషన్

దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే హోలీ వేడుకలు రద్దు ఈ ఏడాది రద్దు చెయ్యాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్ గ్యాదరింగ్.. ఎక్కువమంది ఒక చోట గుమికూడకపోవడమే మేలు అని అందుకు న్యాయపరంగా ఆదేశాలు ఇవ్వాంటూ కొందరు పిటీషన్ దాఖలు చేశారు.(గాంధీ ఆస్పత్రిలో 74 మంది కరోనా అనుమానితులు)

ఈ క్రమంలోనే కరోనా కారణంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. హోలీ వేడుకల వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, జనం గుంపులుగా ఉండే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలను అందరూ పాటించాలని మోడీ ట్వీట్ చేశారు. 

రాబోయే హోలీ వేడుకలకు దూరంగా ఉండాని తానుకూడా నిర్ణయించుకున్నట్లు మోడీ వెల్లడించారు. హైదరాబాద్‌లో కూడా కరోనా కారణంగా హోలీ వేడుకలు రద్దు చెయ్యాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా నాయకురాలు గంపా సిద్ధా లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు.