Maha vs Karnataka: పార్లమెంట్ వరకు వెళ్లిన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. షా ఎంటర్ కవాలన్న ఎన్సీపీ

ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాదాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ 1960లోనే ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్టును మహా ప్రభుత్వం ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులోనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయం యుద్ధం అయితే కొనసాగుతోంది.

Maha vs Karnataka: పార్లమెంట్ వరకు వెళ్లిన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. షా ఎంటర్ కవాలన్న ఎన్సీపీ

Face-off in Lok Sabha on Maharashtra-Karnataka border row

Maha vs Karnataka: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర మధ్య సాగుతున్న సరిహద్దు వివాదం బుధవారం పార్లమెంటుకు చేరింది. శీతాకాల సమావేశాల్లో మొదటి రోజైన బుధవారం లోక్‭సభ ప్రారంభమైన కాసేపటికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. డిసెంబర్ 6న మహారాష్ట్ర నంబరు ప్లేటుతో ఉన్న వాహనాలపై దాడులు జరగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ, ఎన్సీపీ మధ్య కాసేపు వాదనలు జరిగాయి.

‘‘గడిచిన 10 రోజుల నుంచి మహారాష్ట్రలో ఒక వివాదం చాలా కాక మీద కొనసాగుతోంది. మా పొరుగున ఉన్న ముఖ్యమంత్రి చాలా అభ్యంతకరంగా మాట్లాడుతున్నారు. నిన్న (మంగళవారం) మహారాష్ట్రకు చెందిన కొంత మంది సరిహద్దుకు వెళ్లినప్పుడు దాడికి గురయ్యారు. కర్ణాటక సీఎం మహారాష్ట్రను విడగొట్టేలా మాట్లాడుతున్నారు. రెండు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. నిన్న మహారాష్ట్ర ప్రజలు దాడికి గురయ్యారు. మనది ఒకటే దేశం. ఇక్కడ ఇలాంటి వాటికి అనుమతి లేదు’’ అని సుప్రియా సూలే అన్నారు.

Bihar: కోర్టులో ఒక అధికారికి దారుణ అవమానం.. రిజర్వేషన్ మీద వచ్చారా అంటూ ప్రశ్నించిన జడ్జి, హేళనగా మాట్లాడిన లాయర్లు

అనంతరం, ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాన్ని కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిష్కరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆమె కోరారు. అయితే సుప్రియా ఈ అంశాన్ని అవకాశవాదంగా లేవనెత్తారని బీజేపీ ఎంపీ శివకుమార్ ఉదాసి అన్నారు. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అలాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా తలదూరుస్తుందని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు తమవేనని మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు తమవేనని కర్ణాటక ప్రభుత్వం.. ఇలా చాలా కాలంగా వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని బెలగావి మాదేనని మహారాష్ట్ర అంటుంటే, మహారాష్ట్రలోని షోలాపూర్ మాదేనని కర్ణాటక అంటోంది. అప్పుడప్పుడు ఇరు రాష్ట్రాల్లో రాజకీయ నిప్పును రగుల్చుతోన్న ఈ రగడ.. తాజాగా మరోసారి పైకి లేసింది.

BJP vs BJP: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య రగిలిన పాత చిచ్చు.. అట్టుడుకుతోన్న ఇరు రాష్ట్రాలు