Facebook : కొత్త బిజినెస్.. తక్కువ వడ్డీతో రూ.50లక్షల వరకు లోన్లు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... చిరు వ్యాపారులు, స్టార్టప్ లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అండగా నిలిచేందుకు సిద్ధమైంది. భారత్ లో కొత్త బిజినెస్

Facebook : కొత్త బిజినెస్.. తక్కువ వడ్డీతో రూ.50లక్షల వరకు లోన్లు

Facebook

Facebook : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్… చిరు వ్యాపారులు, స్టార్టప్ లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అండగా నిలిచేందుకు సిద్ధమైంది. భారత్ లో కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. స్మాల్ బిజినెస్ లోన్స్ పేరుతో రుణాలు ఇవ్వనుంది. ఈ మేరకు లెండింగ్ ప్లాట్ ఫామ్ ఇండిఫై సంస్థతో ఫేస్ బుక్ ఒప్పందం చేసుకుంది. నామమాత్రపు వడ్డీతో రూ.5 నుంచి 50లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ రోజు నుంచే హైదరాబాద్, ఢిల్లీ సహా ఇతర నగరాల్లో అమలు చేస్తున్నారు. లోన్లు కావాలనుకునే వారు ఇండిఫై సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లెండింగ్ బిజినెస్ మొదటిసారిగా ఇండియాలోనే ఈ వ్యాపారం మొదలుపెట్టడం విశేషం.

”దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకు రుణాలు ఇస్తాం. ఈ రుణాలు తీసుకోవడానికి ష్యూరిటీ అవసరం లేదు. వడ్డీ రేటు 17 శాతం నుంచి 20 శాతం మధ్య ఉంటుంది. కేవలం 5 రోజుల్లో రుణాలు మంజూరు చేస్తాం” అని ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ తెలిపారు. మహిళలు ఈ రుణాలు తీసుకుంటే 0.2 శాతం వడ్డీ తక్కువగా ఉంటుందని తెలిపారు. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రుణాలు దొరకడం ఓ సమస్య అని, ఆ సమస్యకు పరిష్కారంగా ఈ సర్వీస్ ప్రారంభించామని తెలిపారు.

గతేడాది సెప్టెంబర్‌లో 100 మిలియన్ డాలర్ల బిజినెస్ గ్రాంట్ ను ఫేస్ బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశంతో పాటు 30 దేశాల్లో వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు ఫేస్‌బుక్ ఈ చొరవ తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుర్గావ్, ఢిల్లీలో కరోనా తో దెబ్బతిన్న 3వేల చిన్న, మధ్యతరహా వ్యాపారులకు 4 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించిన ఫేస్‌బుక్… ఇప్పుడు 200 పట్టణాల్లో వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ఇండిఫై తో చేతులు కలిపింది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, అలాగే ఫేస్‌బుక్‌కి కూడా లబ్ధి చేకూరుతుందని అజిత్ అన్నారు.