Facebook love: ఫేస్‌బుక్‌ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..

ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం తీసేసింది.. ఊళ్లో తలెత్తుకోలేనంతగా నవ్వులపాలు కావాల్సి వచ్చింది. కలలో కూడా ఊహించని ఘటన జరగడంతో తట్టుకోలేకపోయిన వరుడు.. తనను మోసగించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది...

Facebook love: ఫేస్‌బుక్‌ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..

Wedding

Facebook love: ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం తీసేసింది.. ఊళ్లో తలెత్తుకోలేనంతగా నవ్వులపాలు కావాల్సి వచ్చింది. కలలో కూడా ఊహించని ఘటన జరగడంతో తట్టుకోలేకపోయిన వరుడు.. తనను మోసగించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇరువురు చాటింగ్ చేసుకుంటూ కొద్దిరోజులు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో ఒకరినొకరు కలుసుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మే 24న కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..

24న జాజ్​పుర్​లోని ఛండీఖోల్​లో మేఘనను అలోక్ కలిశాడు. అలోక్ కు మేఘన తెగనచ్చేసింది. వీరిరువురు కొద్దిసేపు మాట్లాడుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరువురు కుటుంబాల్లో విషయాన్ని చెప్పారు. తొలుత కుటుంబ సభ్యులు ఒప్పుకోనప్పటికీ తరువాత వీరి వివాహానికి ఒప్పుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇరువురి పెళ్లి జరిగిపోయింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పెళ్లి తంతు పూర్తయిన తరువాత వరుడు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు ఓ అతిథి వచ్చాడు. పెళ్లి కూతురును చూసి మేఘన అనకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఎందుకలా పిలిచావని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశాడు.

Viral video: భారీ భూకంపం సంభవిస్తే రోడ్లు ఎలా కదులుతాయో తెలుసా..? ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..

మేఘన అమ్మాయి కాదని, అబ్బాయి అని చెప్పడంతో అలోక్ (వరుడు) గుండెబద్దలైంది. ఎంతో ఇష్టంతో పెళ్లిచేసుకుంటే కలలో కూడా ఊహించని ఘటన ఎదురు కావడంతో ఆగ్రహంతో మేఘనాథ్ ను చితకబాదాడు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో తెలియడంతో వరుడు ఇజ్జత్ మొత్తం పోయింది. కుటుంబ సభ్యులు మేఘన అబ్బాయి అని తెలియడంతో పొడువాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.