Facial Recognition: ఎయిర్‭పోర్ట్‭కి వెళ్తే ఇక నుంచి ముఖాన్ని స్కానింగ్ చేయాల్సిందే

ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, సెల్పీ ఆధారిత ఫొటోలను ఉపయోగించి డిజి యాత్ర యాప్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకున్న ఈ సమాచారాన్ని స్టోర్ చేయరని తెలిసింది. ప్రయాణీకుల ఐడీ, ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు ప్రయాణీకుల స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే నిల్వ ఉంటాయని, వారి సమాచారం బయటికి రాకుండా సురక్షితంగా ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Facial Recognition: ఎయిర్‭పోర్ట్‭కి వెళ్తే ఇక నుంచి ముఖాన్ని స్కానింగ్ చేయాల్సిందే

Facial Recognition For Entry To Indian Airports Begins Today

Facial Recognition: ఎలాంటి అవాంతరాలు లేని విమాన ప్రయాణం కోసం దేశంలో డిజి యాత్ర అనే యంత్రాంగాన్ని ఈరోజే ప్రారంభించారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టి) ఆధారంగా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు కాంటాక్ట్‌లెస్, సీంలెస్ ప్రాసెసింగ్‌ను సాధించడానికి డిజి యాత్రను రూపొందించారు. బోర్డింగ్ పాస్‌తో లింక్ చేస్తూ, ముఖ లక్షణాలను ఉపయోగించి పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్ ద్వారా ప్రయాణికులు విమానాశ్రయాలలోని వివిధ చెక్‌పాయింట్ల గుండా వెళ్లవచ్చని ప్రాజెక్ట్ అధికారులు ప్రాథమికంగా తెలిపింది.

ఈ విధానాన్ని మొదటి దశలో దేశంలోని ఏడు విమానాశ్రయాలలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మొదట ఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమనాశ్రయాల్లో ఈరోజు ప్రారంభించారు. తొందరలో హైదరాబాద్, కోల్‌కతా, పూణె, విజయవాడ విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నారు. అనంతరం, ఈ సాంకేతికత దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, సెల్పీ ఆధారిత ఫొటోలను ఉపయోగించి డిజి యాత్ర యాప్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకున్న ఈ సమాచారాన్ని స్టోర్ చేయరని తెలిసింది. ప్రయాణీకుల ఐడీ, ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు ప్రయాణీకుల స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే నిల్వ ఉంటాయని, వారి సమాచారం బయటికి రాకుండా సురక్షితంగా ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

Mayabazar – Premadesam : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న మాయాబజార్, ప్రేమదేశం సినిమాలు..