Fact Check : చిన్నారి నుదుటిపై మూడో కన్ను..అసలు నిజాలు

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 08:20 AM IST
Fact Check : చిన్నారి నుదుటిపై మూడో కన్ను..అసలు నిజాలు

ఏదైనా తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. దీనిద్వారా..తక్కువ సమయంలో..చాలా మందికి తెలిసిపోతోంది. వీడియోలను, సమాచారాన్ని షేర్ చేస్తూ…వైరల్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఫేక్, రియల్ అయినవి ఉంటాయి.

తాజాగా మూడు కళ్లతో పుట్టిన చిన్నారి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. పోతులూరి వీర బ్రహ్మం చెప్పినట్లే..జరుగుతోందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో చిన్నారి నుదుటిపై కన్ను లాంటి ఆకారం ఒకటి ఉంది. రెండు కళ్ల లాగానే ఉండడం గమనార్హం. అయితే..ఎడమ కంటికి నకిలీలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Facebook, Twitter ఇలా సోషల్ మీడియాలో ఈ బుడ్డొడి వీడియో, ఫొటోలు దర్శనమిస్తున్నాయి.

ఇది విదేశాల్లో జరిగిన ఘటనగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే..వీడియో సమయం చాల తక్కువగా ఉండడం వల్ల నిజమా ? కరెక్టేనా అని తేల్చుకోలేకపోతున్నారు. బుడ్డొడికి అందరిలాగానే రెండు కళ్లు మాత్రమే ఉన్నాయని, వీడియో ఎడిటింగ్ ద్వారా నుదుటి మీద లేని నేత్రాన్ని సృష్టించారని పలువురు వెల్లడిస్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి వీడియో వైరల్ అయ్యిందంటున్నారు. దీనిని ఎడిట్ చేసి ఉంటారని ఫేక్ అని కొట్టిపాడేస్తుంటే…మరికొందరు నిజమేనంటున్నారు.