Fact Check : రాత్రి 11.30 గంటల నుంచి వాట్సాప్ బంద్..? ఇందులో నిజమెంత

ప్రతి రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ సేవలు బంద్ చేయాలి. ఈ మేరకు వాట్సాప్ ను భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు యూజర్లు ఈ మేసేజ్ ను 48 గంటల్లో ఫార్వార్డ్ చ

Fact Check : రాత్రి 11.30 గంటల నుంచి వాట్సాప్ బంద్..? ఇందులో నిజమెంత

Fact Check Whatsapp

Fact Check WhatsApp : ”ప్రతి రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ సేవలు బంద్ చేయాలి. ఈ మేరకు వాట్సాప్ ను భారత ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు యూజర్లు ఈ మేసేజ్ ను 48 గంటల్లో ఫార్వార్డ్ చేయలేదంటే వారి వాట్సాప్ అకౌంట్ డీయాక్టివేట్ చేయబడుతుంది. అకౌంట్ ను యాక్టివేట్ చేయాలంటే నెలవారీ ఛార్జీ (రూ.499) చెల్లించాల్సి ఉంటుంది”… ఇప్పుడీ మేసేజ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై రాత్రి పూట వాట్సాప్ సేవలు బంద్ కానున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వార్త నిజమేనేమో అని వాట్సాప్ యూజర్లు కంగారుపడ్డారు. ఈ మేసేజ్ ను ఫార్వర్డ్ చేయడం ప్రారంభించారు. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఇందులో నిజం ఏంటో తేల్చింది.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

‘భారత్ లో రాత్రి పూట వాట్సాప్ సేవలు బంద్’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఇందులో నిజం లేదని చెప్పింది. అవన్నీ వదంతులే అని స్పష్టం చేసింది. వాట్సాప్ సేవలు బంద్ చేయాలంటూ కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. ఇదంతా అబద్దపు ప్రచారం అని, ఎవరూ నమ్మొద్దని సూచించింది.

ఇటీవల అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌‌బుక్ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. భారత్‌‌లో దాదాపు 7 గంటల పాటు.. ఫేస్‌‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా‌‌గ్రామ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ఫేస్‌బుక్‌లో సమస్యలు తలెత్తాయన్న న్యూస్ బయటకు రాగానే ఆ సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. గత నెల నుంచి ఇప్పటి వరకు ఫేస్‌బుక్ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే చాలా కంపెనీలు ఫేస్‌బుక్‌ నుంచి తమ యాడ్స్‌ తొలగించడం గమనార్హం.

Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

కొన్ని గంటల పాటు ఈ సేవలు బంద్ కావడంతో ఏదో కోల్పోయినట్లు అనేక మంది అల్లాడిపోయారు. ఈ సామాజిక మాధ్యమాలు.. 7 గంటలకు పైగా పని చేయకపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా భారత్‌లో యూజర్లు దీని మీద ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫేస్‌‌బుక్‌‌కు ఇండియాలో 41 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్ కు 53 కోట్ల యూజర్లున్నారు. అలాగే ఇన్‌‌స్టాగ్రామ్‌లో 21 కోట్ల మంది భారతీయులకు అకౌంట్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాట్‌‌ఫామ్స్‌‌కు ప్రపంచంలో భారతే అతిపెద్ద మార్కెట్. వీటి సేవలు హఠాత్తుగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. అది మొదలు.. ఈ సోషల్ మీడియా సర్వీసుల గురించి నెట్ లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని.. అది నిజమో కాదో తెలుసుకోకముందే ఆ వార్త వైరల్ అయిపోతోంది. జనాలను కన్ ఫ్యూజ్ చేసి ఆందోళనలో పడేస్తోంది. అందుకే, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకూడదు. అది నిజమో కాదో నిర్ధారించుకున్నాకే దాన్ని ఇతరులకు ఫార్వార్డ్ చేయాలి.