Gorakhpur AIIMS : గోరఖ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ భర్తీ

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు పోస్టును అనుసరించి 58 సంవత్సరాలు మించరాదు.

Gorakhpur AIIMS : గోరఖ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ భర్తీ

Aims Gorakhpur

Gorakhpur AIIMS : భారత ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన గోరఖ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రొఫెసర్లు 28, అడిషనల్ ప్రొఫెసర్లు 22 , అసోసియేట్ ప్రొఫెసర్ 23, అసిస్టెంట్ ప్రొఫెసర్ 32, ఉన్నాయి. భర్తీ చేయనున్న పోస్టుల విభాగాలకు సంబంధించి అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, హాస్సిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు పోస్టును అనుసరించి 58 సంవత్సరాలు మించరాదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ విధానం అధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులను అభ్యర్ధులు ఆప్ లైన్ ద్వారా అందజేయాల్సి ఉంది. దరఖాస్తులు అందజేయాల్సిన చిరునామా ; ఎయిమ్స్ , గోరఖ్ పూర్, యూపీ, దరఖాస్తులకు చివరితేది జనవరి 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsgorakhpur.edu.in/