Virginity Test : ఫస్ట్ నైట్ తర్వాత కన్యత్వ టెస్టులో నవవధువు ఫెయిల్.. అక్కాచెల్లెళ్లకు విడాకులు

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లోనూ ఇంకా పలు చోట్ల మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనాగరిక ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. ఆచార వ్యవహారాల పేరుతో ఇంకా పలువురు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తున్నారు. తాజాగా.. వర్జినిటీ(శీల) పరీక్షలో విఫలమైందని నవ వధువులిద్దరిని పుట్టింటికి పంపించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Virginity Test : ఫస్ట్ నైట్ తర్వాత కన్యత్వ టెస్టులో నవవధువు ఫెయిల్.. అక్కాచెల్లెళ్లకు విడాకులు

Virginity Test

Virginity Test : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లోనూ ఇంకా పలు చోట్ల మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనాగరిక ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. ఆచార వ్యవహారాల పేరుతో ఇంకా పలువురు వ్యక్తులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తున్నారు. తాజాగా.. వర్జినిటీ(శీల) పరీక్షలో విఫలమైందని నవ వధువులిద్దరిని పుట్టింటికి పంపించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

తొలి రాత్రి తర్వాత కన్యత్వ పరీక్ష:
కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో గతేడాది(2020) నవంబర్‌ 27న పెళ్లి జరిగింది. అయితే తొలిరాత్రి తర్వాత వధువు శీలవతా? కాదా? అని తెలుసుకోవడానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఒకరు మాత్రమే ఉత్తీర్ణులు కాగా, మరొక వధువుకి ఎలాంటి రక్తస్రావం కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్తింటి వారు పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా రూ.10 లక్షల ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు.

పెళ్లికి ముందే అమ్మాయికి మరొకరితో సంబంధం?
దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు జాత్ పంచాయతీ వారిని సంప్రదించగా అక్కడా వారికి నిరాశే ఎదురైంది. పంచాయతీ పెద్దలు మరింత దారుణంగా మాట్లాడారు. ఏకంగా విడాకులు ఇప్పించారు. కులంలోని కట్టుబాట్ల ప్రకారం వర్జినిటీ(శీల) పరీక్షలో యువతి విఫలమైందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. అంతేకాదు ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పు చెప్పారు. ఆపై ఆ ఇద్దరికీ భర్తల నుంచి విడాకులు ఇస్తున్నట్టు కులపెద్దలు షాకింగ్ తీర్పిచ్చారు. దీంతో అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు మరింత నిర్ధాంతపోయారు. చేసేదేమీ లేక.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెల్లని వస్త్రంపై రక్తపు మరకలు కనిపిస్తేనే…
మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్ బట్ వర్గంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ వర్గంలోని ప్రతి మహిళ తొలి రాత్రి తర్వాత శీల పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అది కూడా గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే జరగడం గమనార్హం. తొలి రాత్రిని తెల్లని వస్త్రం మీద వరుడు, వధువు జరుపుకోవాల్సి ఉంటుంది. తొలి రాత్రి తర్వాత ఆ తెల్లటి వస్త్రాన్ని పరిశీలిస్తారు. దానిపై రక్తపు మరకలు ఉండాలి. వధువు కన్యత్వానికి సంబంధించి ఆ రక్తపు మరకలను రుజువుగా పరిగణిస్తారు. తెల్లటి వస్త్రంపై రక్తపు మరకలు లేకపోతే.. కన్యత్వ టెస్టులో ఫెయిల్ అయినట్టే. అంటే..ఆమె వర్జిన్ కాదని అర్థం. ఇది వరకే ఆమెకు ఎవరితోనో సంబంధం ఉందని నిర్ధారిస్తారు.

5జీ రోజుల్లోనూ అనాగరిక ఆచారాలా?
ఈ అమానవీయ ఘటన చర్చనీయాశంగా మారింది. ఈ రోజుల్లోనూ అనాగరిక ఆచారాలతో మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించాన్ని మహిళా సంఘాలు తప్పుపడుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వం కలగజేసుకుని ఆ పంచాయతీ పెద్దలు, ఈ ఊరి ప్రజల్లో మార్పు తేవాలని కోరుతున్నారు.