ఫేక్ మెడికల్ వర్శిటీ : వెయ్యిమందిని ముంచేశాడు..

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 09:49 AM IST
ఫేక్ మెడికల్ వర్శిటీ : వెయ్యిమందిని ముంచేశాడు..

తమిళనాడు : ఇంట్లోనే ఏకంగా  ఓ నకిలీ యూనివర్శిటీని సృష్టించేశాడు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసేసి వెయ్యి మంది స్టూడెంట్స్ ను మంచేశాడు. ఇలా ఒకటి రెండు కాదు ఏడు సంవత్సరాల పాటు మెడికల్ విద్యార్ధులను మోసం చేస్తు..బండారం బైటపడి కటకటాలు లెక్కిస్తున్నాడు. 

ప్రస్తుతం ఎక్కడా చూసినా నకిలీ..నకిలీ నకిలీ..అన్నింటా నకిలీయే. దీన్నే వ్యాపారం చేసుకున్న కేటుగాళ్లు డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్, ఐడీ కార్డ్స్ లతో సహా ఎన్నో నకిలీలను క్రియేట్ చేసి జనాలకు టోపీ పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునే ఈ కేటుగాడు ఏకంగా ఓ నకిలీ యూనివర్శిటీని సృష్టించేశాడు. తమిళనాడులోని నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్‌’ పేరుతో ఇంట్లోనే ఓ యూనివర్సిటీని స్థాపించాడు. ఇదే పేరుతో  ఏడేళ్ల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులకు మెడికల్ డిగ్రీ పట్టాలు ఇచ్చేస్తున్నాడు. ఈ వ్యవహారంపై విద్యార్థులతో పాటు అధికారులకు సైతం ఎలాంటి అనుమానం రాలేదు. మెడికల్ డిపార్ట్ మెంట్ చేపట్టిన ఫేక్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తనిఖీలలో భాగంగా..ఈ ఫేక్ యూనివర్శిటీ ఇస్తున్న సర్టిఫికెట్లపై అనుమానం వచ్చిన తనిఖీలు చేయటంతో నకిలీ వర్శిటీ బండారం బైటపడింది. 

ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు యూనివర్సిటీ అడ్రస్ కు వెళ్లి విస్తుపోయారు. ఓ ఇంటి అడ్రస్ తో సెల్వరాజ్ అనే వ్యక్తి ఈ నకిలీ యూనివర్శిటీని నిర్వహిస్తున్నట్లుగా తేలింది. ఆ ఇంటిపై దాడి చేసిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఏడేళ్ల పాటు నడిచిందని బాధితులు ఆరోపిస్తున్నారు. నకిలీ వర్శిటీ ప్రబుద్ధుడికి అరదండాలు వేసి కటకటాల వెనక్కి నెట్టారు.