Fake police station : పోలీస్ స్టేషన్ పక్కనే నకిలీ పోలీస్ స్టేషన్ .. 8 నెలలకు గుర్తించిన పోలీసులు

పోలీసు స్టేషన్ పక్కనే కొంతమంది ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లు చేస్తున్నా అసలు పోలీసులు గుర్తించని వైనం బీహార్ లో బయటపడింది. 8 నెలలుగా నకిలీ పోలీస్ స్టేషన్ లో నకిలీ పోలీసులు నకిలీ గన్ లతో తిరుగుతూ అక్రమంగా జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా అసలు పోలీసులు గుర్తించలేకపోయారు. కానీ ఎట్టకేలకు అసలు విషయం బయటపడింది.

Fake police station : పోలీస్ స్టేషన్ పక్కనే నకిలీ పోలీస్ స్టేషన్ .. 8 నెలలకు గుర్తించిన పోలీసులు

Fake police station running in guest house  in bihar

Fake police station running in guest house  in bihar : నేరాలను గుర్తించి నేరస్థులను అరెస్ట్ చేసి విచారించే పోలీసులే నేరస్థుల ఉచ్చులో పడుతుంటారు. పక్కనే నేరస్తులు ఉన్నా గుర్తించలేరు. ఇదేదో పోలీసులపై నిందలు మోపటం కాదు. పోలీసు స్టేషన్ పక్కనే కొంతమంది ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లు చేస్తున్నా అసలు పోలీసులు గుర్తించని వైనం బీహార్ లో బయటపడింది. 8 నెలలుగా నకిలీ పోలీస్ స్టేషన్ లో నకిలీ పోలీసులు నకిలీ గన్ లతో తిరుగుతూ అక్రమంగా జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా అసలు పోలీసులు గుర్తించలేకపోయారు. కానీ ఎట్టకేలకు అసలు విషయం బయటపడింది. నకిలీ పోలీస్ స్టేషన్ గుట్టును 8 నెలల తరువాత అసలు పోలీసులు గుర్తించారు.

బీహార్‌లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి డీఎస్పీ సహా అందరినీ నియమించేశాడు. అంతేకాదు వారికి నాటు తుపాకులు ఇచ్చి రోడ్లపైకి వసూళ్లకు పంపాడు. చెకింగుల పేరుతో వాహనదారులను భయపెట్టి వారు డబ్బులు గుంజుకునేవారు. ఈ నకిలీ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే అసలు పోలీస్ స్టేషన్ ఉన్నా గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో నాటు తుపాకి చూసిన అసలు పోలీసు ఆరా తీయడంతో 8 నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాంకా జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు భోలా యాదవ్ పోలీసు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఇదేదో బాగుంది కేవలం వసూళ్లే ఎందుకు ఏకంగా ఓ ఫేక్ పోలీస్ స్టేషన్ నే పెట్టేస్తే పోలా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన గెస్ట్ హౌస్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేశాడు. తాను డబ్బులు వసూలు చేసిన వారికి నకిలీ యూనిఫామ్‌లు ఇచ్చి పోలీసులుగా నియమించేసుకున్నాడు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. వారికి నాటు తుపాకులు కూడా ఇచ్చాడు. వారు కూడా తాము నిజంగానే పోలీసులం అయిపోయామని సంబరపడ్డారు. తాను డబ్బులు వసూలు చేసిన అనిత, జూలీ అనే మహిళలకు కూడా పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు. వారితో పాటు మరో ముగ్గురిని తన ముఠాగా ఏర్పరచుకుని వారికి డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగాలు ఇచ్చాడు.

ఇక వారి వసూళ్ల విహారం మొదలు పెట్టారు. వాహనం కనిపిస్తే చాలు అదీ ఇదీ అంటూ వసూళ్లు కొనసాగిస్తున్నారు. నాటు తుపాకులతో రోడ్లపైకి వచ్చిన నకిలీ పోలీసులు వాహనదారులను, జనాన్ని, వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజేవారు. అలా ‘నకిలీ’హవా ఎనిమిది నెలలపాటు కొనసాగింది. నకిలీ పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. వారికి ఇక తిరుగేలేదన్నట్లుగా చేసిన ఓవర్ యాక్షన్ తో గుట్టు బయటపడింది.

అసలు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు బుధవారం (17,2022)నాటు తుపాకులతో నిలబడిన నకిలీ పోలీసులను చూసి అనుమానించాడు. ఆ తర్వాత ఆరా తీయడంతో నకిలీ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలిసిన ప్రధాన నిందితుడు భోలా యాదవ్ పరారైపోయాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.