Delhi Air Quality : ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతుది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది.

Delhi Air Quality : ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

Falling air quality

Delhi Air Quality : ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతోంది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్వచ్ఛమైన గాలి లేక శ్వాస తీసుకోవాలన్న భయంతో వణికిపోతున్నారు. మరోవైపు నగరంపై దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337 కు పడిపోవం అంటే దాన్ని తీవ్ర వాయ కాలుష్యంగా పరిగణించవచ్చు.

Building Construction Demolition Banned : ఢిల్లీలో బాగా త‌గ్గిన గాలి నాణ్య‌త.. భవన నిర్మాణాలు, కూల్చివేతలు నిషేధం

కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని
ఏక్యూఐ 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం.

ఏక్యూఐ 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, ఏక్యూఐ 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, ఏక్యూఐ 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా చెప్పవచ్చు.