Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా

ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితులంతా చేరుకున్నారు. అతిథులకు మంచి బిర్యానీతో డిన్నర్ ఆర్డర్ చేశారు. పెండ్లి తంతు సక్రమంగా సాగుతుందనుకున్న సమయంలో.. ఒక్కసారిగా పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికి వాయిదా వేస్తున్నాం..

Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా

Wedding Called Off

Wedding Called Off: ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితులంతా చేరుకున్నారు. అతిథులకు మంచి బిర్యానీతో డిన్నర్ ఆర్డర్ చేశారు. పెండ్లి తంతు సక్రమంగా సాగుతుందనుకున్న సమయంలో.. ఒక్కసారిగా పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికి వాయిదా వేస్తున్నాం.. మరోరోజుకు పెండ్లి ముహూర్తం పెట్టుకుందామని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో పెండ్లికి వచ్చినవారంతా ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. కొద్దిసేపటికి అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇదంతా జొమాటో నిర్ల‌క్ష్యంతోనే జ‌రిగింద‌ని కుటుంబ స‌భ్యులు వాపోయారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. బిర్యాని లేని కారణంగా కొత్త జంట ఒక్కటి కాలేకపోయింది.

Aadhi Nikki Wedding: ఆది పెళ్లిలో స్టెప్పులేసిన నాని, సందీప్.. వీడియో వైరల్!

తమిళనాడులోని ఒరతనాడు ప్రాంతంలో కొత్త జంట ఒక్కటయ్యేందుకు మంగళవారం పెండ్లి ముహూర్తం నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే పెండ్లి కార్యక్రమం కొనసాగుతుంది. పెండ్లికి వచ్చే వారికోసం నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఇందుకోసం సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో బిర్యానీ సెంటర్ నిర్వాహకులు జొమాటో 3,500 కిలోల మాంసాన్ని సరఫరా చేసింది. బెంగళూరు నుంచి తమిళనాడుకు మటన్, చికెన్ ను పార్శిల్ చేసింది. ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు మటన్, చికెన్ ను కడిగి బిర్యానీ తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జొమాటో ద్వారా ఆన్ లైన్ లో వచ్చిన పార్శిల్ ను తీసి చూడగా అందులో అధికశాతం కుళ్లిన మాంసం రావడాన్ని గమనించారు.

Wedding Gift Blast: పెళ్లి గిఫ్ట్ బ్లాస్ట్.. చేతిని కోల్పోయిన కొత్త పెళ్లి కొడుకు!

ఈ విషయాన్ని తెలుసుకున్న పెండ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తనిఖీలు నిర్వహించిన అధికారులు అది కుళ్లిన మాంసమేనని తేల్చారు. దీనిపై జొమాటో వివరణ ఇవ్వాలని సేలం ఆర్ఆర్ బిర్యానీ నోటీసులు జారీ చేసింది. పెండ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులకు రుచికరమైన బిర్యానీ పెడదామని వధువు, వరుడు కుటుంబ సభ్యులు భావించారు. అయితే అనుకోని ఘటనతో రుచికరమైన భోజనం పెట్టలేక పోవటంతో పెండ్లిని కూడా వాయిదా వేసుకున్నారు. బిర్యానీ లేకపోవడంతోనే పెండ్లిని వాయిదావేసుకున్నామని వధూవరుల కుటుంబ సభ్యులు తెలిపారు. దీనంతటికీ కారణం జొమాటోనేనని ఆరోపించారు.