రెండో పెళ్లి చేస్తారా ? లేదా ? కరెంటు పోల్ ఎక్కిన 60 ఏళ్ల వ్యక్తి

తనకు రెండో పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు.

రెండో పెళ్లి చేస్తారా ? లేదా ? కరెంటు పోల్ ఎక్కిన 60 ఏళ్ల వ్యక్తి

Current Pole

Second Marriage : తనకు రెండో పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు. తన మాట వినకపోతే…కరెంటు వైర్లు పట్టుకుని చచ్చిపోతానని బెదిరించాడు. కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. చివరకు బుజ్జగించి..బతిమాలడంతో కిందకు దిగాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఢోలాపూర్ ప్రాంతంలో 60 ఏళ్ల వయస్సున్న సోబ్రన్ సింగ్ నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం సోబ్రన్ భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు పిల్లలున్నారు. వీరందరికీ వివాహాలు జరిగిపోయాయి. కొందరికి పిల్లలు కూడా పుట్టారు. భార్య లేకపోవడంతో తనకు మరోపెళ్లి చేయాలని కుటుంసభ్యులపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. దీనికి వాళ్లు నో చెప్పారు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో..మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకరావడం..ఎప్పటిలాగానే..కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో..ఆగ్రహానికి గురైన సోబ్రన్…సమీపంలో ఉన్న 11 కెవి హైటెన్షన్ వైర్లు ఉన్న కరెంటు స్తంభం ఎక్కాడు.

ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. కిందకు దిగిరావాలంటూ బుజ్జగించారు. పెళ్లి చేయకపోతే..స్తంభం నుంచి దూకి చనిపోతానని బెదిరిచాడు. కిందకు దిగడానికి ఎంతమటుకు ఒప్పుకోలేదు. చివరకు కుటుంబసభ్యులు సబ్ స్టేషన్ కు తెలియచేశారు. కరెంటు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కుటుంబసభ్యులు చివరకు బుజ్జగించి, బతిమాలడంతో సోబ్రన్ కిందకు దిగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.