Manmohan Singh : కేంద్ర ఆరోగ్యమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం ఆగ్రహం

తీవ్ర జ్వరం,నీరసంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే.

Manmohan Singh : కేంద్ర ఆరోగ్యమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం ఆగ్రహం

Manmohan (2)

Manmohan Singh  తీవ్ర జ్వరం,నీరసంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు,నేతలు మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అయితే కేంద్రఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయపై మన్మోహన్ సింగ్‌ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న తన తండ్రితో మాండవీయ ఫొటోలు తీయించుకోవడాన్ని మన్మోహన్ సింగ్ కుమార్తె తప్పుబట్టారు. శుక్రవారం మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ ఓ ప్రకటనలో..మన్మోహన్ సింగ్ ను పరామర్శించేందుకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎయిమ్స్ కి వచ్చారని..అయితే ఆయనతోపాటు ఫొటోగ్రాఫర్ ఉండటాన్ని గమనించిన తన తల్లి ఆ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించవద్దని చెప్పారన్నారు.

ఫొటోగ్రాఫర్‌ను గది నుంచి పంపించేయాలని తన తల్లి పట్టుబట్టినప్పటికీ మన్‌సుఖ్ మాండవీయ పట్టించుకోలేదని డామన్ సింగ్ తెలిపారు. తన తల్లి మాటలను పట్టించుకోకుండా తన తండ్రితో కలిసి మాండవీయకు ఫొటోలు తీశారన్నారు. దీంతో తన తల్లి చాలా బాధపడ్డారన్నారు. తన తండ్రిని పరామర్శించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రావడం మంచిదేనని.. కానీ ఆ సమయంలో ఫొటోలు దిగే పరిస్థితిలో తన తల్లిదండ్రులు లేరన్నారు.

ప్రస్తుతం తన తండ్రి ఎయిమ్స్‌లో డెంగ్యూతో చికిత్స పొందుతున్నారని,పరిస్థితి స్థిరంగా ఉందని అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని డామన్ సింగ్ చెప్పారు. అందుకనే తన తండ్రిని చూడడానికి వచ్చే వారి సంఖ్యను పరిమితం చేసినట్లు తెలిపారు.

ALSO READ IPL 2021 Finals KKR Vs CSK దంచికొట్టిన డుప్లెసిస్.. కోల్‌కతా ముందు భారీ లక్ష్యం