Kerala Woman: కేరళ మహిళకు ఉరిశిక్ష విధించిన యెమెన్ కోర్టు: క్షమాబిక్ష పెట్టాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు

తన పాస్ పోర్ట్ ను దాచిపెట్టి, బానిసగా తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్న ఒక యెమెన్ యజమానిని హత్య చేసిందంటూ కేరళకు చెందిన ఒక మహిళకు ఆదేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

Kerala Woman: కేరళ మహిళకు ఉరిశిక్ష విధించిన యెమెన్ కోర్టు: క్షమాబిక్ష పెట్టాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు

Nimish

Kerala Woman: తన పాస్ పోర్ట్ ను దాచిపెట్టి, బానిసగా తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్న ఒక యెమెన్ యజమానిని హత్య చేసిందంటూ కేరళకు చెందిన ఒక మహిళకు ఆదేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తిని 2017లో హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నిమిషా ప్రియాకు అక్కడి చట్టం ప్రకారం ఉరి శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. అయితే నిమిషా ప్రియాను విడిపించేందుకు ఆమె కుటుంబ సభ్యులు శాయశక్తులా కృషిచేస్తున్నారు. ఆమేరకు “సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ పేరిట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో నిమిషా ప్రియా తల్లి, ఆమె కూతురు సహా మరో నలుగురు సభ్యులుగా ఉన్నారు. కాగా నిమిషా ప్రియాను మరణ శిక్ష నుంచి తప్పించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన సంప్రదింపులు జరపాలంటూ ఆమె కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరిగారు.

Also read:Corona in Delhi: కరోనా కేసుల పెరుగుదలతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం: మార్గదర్శకాలు విడుదల

ఈవిషయంలో వారు ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా..ఏప్రిల్ 11న కోర్టు విచారణ చేపట్టింది. నిమిషా ప్రియా మరణశిక్షపై దౌత్యపరమైన సంప్రదింపులకు భారత ప్రభుత్వాన్ని ఆదేశించలేమని..అదే సమయంలో వారికి న్యాయ సహాయం చేయలని కూడా ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే..నిమిషా ప్రియాను విడిపించేందుకు యెమెన్ లోని బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందిస్తామని లేని పక్షంలో క్షమాపణ కోరుతామని “సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్” సభ్యులు ఢిల్లీ హైకోర్టుకు సూచించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ “యెమెన్ వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని, మిమ్ములను ఆపిందెవరంటూ” వ్యాఖ్యానించారు.

Also read:KS Eshwarappa : కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు.. కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా!

అయితే 2016 నుంచి భారతీయులను యెమెన్ వెళ్లకుండా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో గురువారం నిమిషా ప్రియా తల్లి, కుమార్తెలు యెమెన్ లో ఆమెను సందర్శించడానికి అనుమతి కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. హత్యకు గురైన తలాల్ అబ్దో మహ్దీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని క్షమాపణ చెప్పాలని కౌన్సిల్ నిర్ణయించింది. నిమిషా తల్లి ప్రేమకుమారి, ఎనిమిదేళ్ల కుమార్తె, ‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’కు చెందిన నలుగురు సభ్యులు ఆమెను విడుదల చేయడానికి చివరి ప్రయత్నంగా యెమెన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే నిషేధం కారణంగా ఈ బృందం అనుమతి తీసుకోకుండా యెమెన్ కు ప్రయాణించడానికి వీల్లేదు.

Also read:Trinamool Congress MP: మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై చిన్న నేరం జరగడం కూడా సిగ్గుచేటు

గత వారం నిమిషా తన తల్లికి రాసిన లేఖలో, “క్షణికావేశంలో అనుకోని పొరపాటుగా హత్య జరిగిందని, యెమెన్ పౌరుడి కుటుంబం మరియు దేశ ప్రజలు తనను క్షమిస్తారని” ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదేశ అధికారులు మరియు మరణించిన పౌరుడి కుటుంబం తనకు క్షమాభిక్ష ఇస్తారా అనే దాని గురించి ఆందోళన చెందుతున్నట్లు నిమిషా తన లేఖలో పేర్కొన్నారు. కాగా బ్రతుకుదెరువు కోసం యెమెన్ వెళ్లిన నిమిషా ప్రియాను..తన భార్యగా పేర్కొంటూ తలాల్ అబ్దో మహ్దీ దొంగ పత్రాలు సృష్టించాడు. అనంతరం ఆమెను బందించి, పాసుపోర్టు లాక్కుని చిత్రహింసలకు గురిచేసినట్లు నిమిషా అక్కడి కోర్టుకు తెలిపింది. అయితే హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధించింది కోర్టు.