Arshi Khan : బిగ్‌బాస్‌ బ్యూటీకి పబ్లిక్‌లో చేదు అనుభవం.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టాడు.. ఆ తర్వాతి రోజే కరోనా

హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్, నటి అర్షి ఖాన్‌కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్టులో అర్షి ఖాన్ కనిపించగానే.. ఆమె దగ్గరికి ఓ వెళ్లిన ఓ అభిమాని.. ఒక సెల్ఫీ కావాలని అడిగాడు. తన అభిమాని కావడంతో ఆమె కాదనలేకపోయింది. సరే చెప్పింది. ఫొటోకు ఫోజిచ్చింది. ఆ కుర్రాడు సెల్ఫీ తీసుకున్నాడు. అంతా అయిపోయింది అని అనుకునేలోపే.. ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కుర్రాడు ఏకంగా అక్కడ ముద్దు పెట్టేశాడు.

Arshi Khan : బిగ్‌బాస్‌ బ్యూటీకి పబ్లిక్‌లో చేదు అనుభవం.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టాడు.. ఆ తర్వాతి రోజే కరోనా

Fan Kisses Arshi Khan

Arshi Khan : హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్, నటి అర్షి ఖాన్‌కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్టులో అర్షి ఖాన్ కనిపించగానే.. ఆమె దగ్గరికి ఓ వెళ్లిన ఓ అభిమాని.. ఒక సెల్ఫీ కావాలని అడిగాడు. తన అభిమాని కావడంతో ఆమె కాదనలేకపోయింది. సరే చెప్పింది. ఫొటోకు ఫోజిచ్చింది. ఆ కుర్రాడు సెల్ఫీ తీసుకున్నాడు. అంతా అయిపోయింది అని అనుకునేలోపే.. ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కుర్రాడు ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా అర్షి ఖాన్ షాక్‌ తింది. అతడి చేష్టతో విస్తుపోయింది. ఏం చేయాలో అర్థం కాక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

అభిమాని ముద్దు పెట్టడమే పెద్ద ట్విస్ట్ అనుకుంటే.. అర్షి ఖాన్ అంతకుమించి ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆమె షాకింగ్ న్యూస్ చెప్పింది. దీంతో అందరూ ఆ అభిమాని గురించి ఆలోచిస్తున్నారు. కోవిడ్ వచ్చిన అర్షిని ముద్దు పెట్టుకున్న అతడు ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? అని వాకబు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

ఆఫ్ఘనిస్థాన్‌ లో పుట్టి.. నాలుగేళ్ల వయసులోనే ఇండియాకు వచ్చేసింది అర్షి ఖాన్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చదువును పూర్తి చేసుకున్న ఈమె.. మోడల్ అవ్వాలన్న లక్ష్యంతో ముంబైలో అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. పలు యాడ్స్‌లోనూ నటించింది. ఈ క్రమంలోనే ఆ రంగంలో చాలాకాలం తన హవాను చూపించి ఫేమస్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

మోడల్‌గా ఫుల్ బిజీగా గడుపుతున్న సమయంలోనే అర్షి ఖాన్.. హిస్టారిక్ 4డీ ఫిల్మ్ ‘ద లాస్ట్ ఎంపరర్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన ‘మల్లి మిస్తు’ అనే సినిమాను చేసింది. కేవలం రెండు చిత్రాల్లోనే నటించినా పాపులారిటీ బాగానే దక్కింది. దీనికి కారణం మ్యూజిక్ వీడియోలు, టీవీ షోలలో పాల్గొనడమే.

 

View this post on Instagram

 

A post shared by ARSHI KHAN AK (@arshikofficial)

మోడల్‌గా, నటిగా ఎనలేని గుర్తింపును దక్కించుకున్న అర్షి ఖాన్.. 2017లో ప్రసారం అయిన హిందీ బిగ్ బాస్ 11వ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. అందులో చాలారోజుల పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. అదే సమయంలో గొడవల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇలాంటి వాటి వల్లే 83వ రోజు షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోని అత్యంత వివాదాస్పద పోటీదారులలో అర్షి ఒకరు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)