Farmers : డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమణ
పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు.

Farmers (3)
Farmers : పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లపై ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే ఏడాదికి పైగా చేస్తోన్న తమ నిరసనను విరమిస్తామని బుధవారం విలేకరుల సమావేశంలో రైతులు తెలిపారు. సింఘు సరిహద్దులో 32 రైతు సంఘాల నేతలు బుధవారం సమావేశం నిర్వహించి..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
ఎంఎస్పి, పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలపై ఏర్పాటు చేసే కమిటీకి 5 మంది రైతు నేతల పేర్లను సిఫారసు చేయాలని మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కి సూచించిన నేపథ్యంలోనే ఇవాళ రైతుల సమావేశం జరిగింది. కమిటీ సభ్యుల పేర్లతో పాటు తదుపరి కార్యాచరణపై డిసెంబర్4న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని మంగళవారం SKM తెలిపింది.
మరోవైపు,మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ఆమోదించిన విషయం తెలిసిందే.